రోటీ చపాతీలలోకి కొత్తగా ఘాటైన కూర్మ కోసం ఎదురు  చూస్తున్నారా? అయితే సోయా ఖీమా మసాలా ట్రై చేయండి.నాన్- వెజ్ కర్రీని మరిపించే విధంగా ఈ సోయా ఖీమా మాసాలా రుచి ఉంటుంది. సాధారణంగా మీల్ మేకర్ తో ఏది చేసినా అందరూ ఇష్టపడతారు.
ఈ సోయా ఖీమా మసాలా వేడి వేడి అన్నంలోకి, పూరి, ఇడ్లి, సెట్ దోశ, అట్టు ఇలా ఎందులోకైన కూడా రుచిగా ఉంటుంది.ఈ కూరకి నూనె ఎక్కువుంటే రుచిగా ఉంటుంది

కావాల్సిన పదార్ధాలు:

3/4 cup సోయా గ్రానుల్స్

1 ఉల్లిపాయ పెద్దది- సన్నని తరుగు

2 పచ్చిమిర్చి- సన్నని తరుగు

1/3 cup నూనె

1 tsp అల్లం వెల్లూలి పేస్టు

2 టమాటో పెద్దది

1 tsp కారం

ఉప్పు- రుచికి సరిపడా

1 tsp ధనియాల పొడి

1/2 tsp గరం మసాల

1/4 tsp పసుపు

150 ml నీళ్ళు

తయారీ విధానం:

నూనె వేడి చేసి ఉల్లిపాయలు పచ్చి మిర్చి వేసి ఉల్లిపాయలు పింక్ కలర్ లోకి వచ్చే దాక ఫ్రై చేసుకోవాలి.అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఉల్లిపాయలను ఎరుపు రంగు వచ్చేవరకు వేపకూడదు. తరువాత అల్లం వెల్లూలి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా వేపాలి.ఇప్పుడు అందులో టమాటో ముక్కలు వేసి గుజ్జుగా అయ్యేదాకా లో-ఫ్లేం మీద మగ్గించుకోండి. నూనె పైకి తేలాక అప్పుడు ఉప్పు తో పాటు మిగిలిన మసాలా పొడులన్నీ వేసి నూనె పైకి కనిపించేదాకా వేపుకోండి.ఇప్పుడు ముప్పై నిమిషాలు వేడి నీటి లో నానా బెట్టిన సోయా గ్రానుల్స్ లోని నీటిని పిండి వేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ పెట్టి ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి మీల్ మేకర్స్ వేయండి. అలాగే కొంచెం మసాలా పొడి కూడా చల్లండి.  మసాలాలు బాగా పెట్టేవరకు మంచి సువసనోచ్చెంత వరకు వేయించుకోండి.సొయా పచ్చివాసన పోయేదాకా వేపాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద ఉడుకుతున్న కర్రీలో వేయండి.ఇప్పుడు అన్ని మగ్గాక నీళ్ళు పోసుకుని బాగా కలుపుకుని పుదినా తరుగు వేసి లో-ఫ్లేం మీద నీరు ఇగిరిపోయి కూర లోంచి నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకుంటే చాలు.







మరింత సమాచారం తెలుసుకోండి: