అటుకులు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.శ్రీ క్రిష్ణుడికి అటుకులతో పంచదార కలిపి పెడితే చాలు ఆయన అనుగ్రహం లబిస్తుందని పెద్దలు అంటారు.అలాంటి అటుకులతో చిటికెలో స్వీట్ తయారు చేసి క్రిష్ణుడికి నైవేద్యంగా సమర్పిద్దాo రండి.

కావాల్సిన పదార్దాలు:

కాజు:2 టేబుల్ స్పూన్స్

కిస్మిస్స్: 2 టేబుల్ స్పూన్స్

నెయ్యీ: 2 టేబుల్ స్పూన్స్

అటుకులు:2 కప్పులు

ఎండు కొబ్బరి తురుము:1/2 కప్పు

పాలు:1 కప్పు

బెల్లం:3/4 కప్పు

పంచదార:1/4 కప్పు

యాలుకల పొడి:1/2 టీ స్పూన్

పచ్చ కర్పూరం:చిటికెడు(ఆప్షనల్)

తయారి విదానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2  టేబుల్ స్పూన్స్ నెయ్యీ వేసుకొని, నెయ్యీ వేడి ఐన తర్వాత అందులోకాజు, కిస్మిస్స్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిoచుకోవాలి. తర్వాత వాటిని పక్కకు తీసేసి అదే పాన్లో అటుకులను 2 కప్పులు వేసి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి.ఈ వంటకం మొత్తాన్ని లో ఫ్లేమ్లో చేయాలి.లేకపోతే అటుకులు మాడిపోయే ఆస్కారం ఉంటుంది.ఇక్కడ అటుకులు అటు మరిలావుగాను,మరి సన్నగా కాకుండా మధ్యస్తంగా తీసుకోవాలి.తర్వాత అందులో  1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమువేసి 2 నుంచి 3 నిమిషాలు కలపాలి.తర్వాత అందులో 1 కప్పు పాలను కొంచం కొంచం వేసి కలుపుతూ ఉండాలి.తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత అందులో 3/4 కప్పు బెల్లం, 1/4 కప్పు పంచదార వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూఉండాలి. బెల్లం,పంచదార కరిగి మిశ్రమం కొంచెం దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలుకుల పొడి వేసి తర్వాత పచ్చ కర్పూరం చిటికెడు(ఆప్షనల్)వేసి కలుపుకున్నాక ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాజు, కిస్మిస్స్ ను కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే.ఈ శ్రీ క్రిష్ణ జన్మాష్టమికి క్రిష్ణుడికి ఎంతో ప్రీతి ఐన అటుకలతో నైవేద్యంగా స్వీట్ తయారు చేసి సమర్పిoచoడి.


మరింత సమాచారం తెలుసుకోండి: