కాస్త ప్రేమమా పట్టేదంతా ఆనం పెట్టినందుకు యజమాని ప్రాణాలను కాపాడడానికి కూడవెనుకాడకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి తన విశ్వాసం చాటుకుంది ఓ శునకం. యజమానిని  కాటువేయడానికి చూస్తున్న ఓ సర్పం నుండి ఆ పెంపుడు కుక్క కాపాడిన ఘటన ఖమ్మం జిల్లా లోని కల్లూరు మండలం పరిధిలోని గోపాలకుంటలో జరిగింది.

 

 
వివరాలలోకి వెళితే గోపాలపురంలో కిశోర్ అనే వ్యక్తి స్థానికంగా ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. అతడికి స్నూపీ అనే ఓ పెంపుడు కుక్క ఉంది. శనివారం (ఏప్రిల్ 11) రోజు కిషోర్ తమఇంటి వెనుకాల మంచంమీద నిద్రిస్తున్నాడు. అసందర్భలో యజమాని కి సమీపంలో ఓ సర్పం వచ్చింది. తరువాత మరింత బుసలు కొడుతూ యజమానికి సమీపాన రాసాగింది అయితే ఇది గమనించిన స్నూపీ అరవడం స్టార్ట్ చేసింది. నిద్రనుండి మేల్కొన్న కిషోర్ చూసుకోగా అప్పటికే మంచం పైవరకు ఎక్కేసింది .

 

అప్పుడు ఆ స్నూపీ ఒక్క ఉదుటున ఆ సర్పాన్ని తన నోటితో కరాచీ పట్టుకొన పక్కకు లాగి కరవ సాగింది. యజమాని సర్పాన్ని కర్రతో కొట్టి చంపేశాడు . కానీ స్నూపీ మాత్రం పాముకాటుకు గురి అయ్యింది. విషయం గమనించిన యజమాని మెటర్నరీ హాస్పిటల్కు తీసుకువెళ్లాడు కానీ దురదృష్టం మార్గ మద్యం లోనే స్నూపీ తన ప్రాణాలను విడిచింది . యజమాని కుటుంబం సభ్యులు మాత్రం ఇంట్లో సొంత మనిషి చనియినట్లుగా భావించి కన్నీరు మున్నీరు అవుతున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: