వారికి ఏటీఎంలలో దగ్గర సెక్యూరిటీ లేకుండా ఉండే ఏటీఎంలే టార్గెట్. అది గమనించుకొని ఆ దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇక ఇటీవల ఇలాంటి తరహాలోనే ఒక ఏటీఎంలో దాదాపు 28 లక్షలు దొంగతనం చేసినట్లు తెలుస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... హర్యానాలోని గుర్గాన్ ఓ ఏటీఎం కియా సే ప్రాంతం దగ్గరకు మనీ విత్ డ్రా చేసుకోవడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. కార్డు ఏటీఎంలో ఉంచాడు కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మల్లరి కొద్దీ సమయం తర్వాత మళ్ళీ ట్రై చేయడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో బ్యాంకు పర్సనల్ హెల్ప్ లైన్ కి కాల్ చేసి ప్రతి విషయాన్ని తెలియజేశాడు. 

 

దీనితో బ్యాంక్ అధికారులు అతను ఇచ్చిన కంప్లైంట్ రాసుకొని ఏటీఎం దగ్గరికి వెళ్లి చెక్ చేయడం జరిగింది. అసలు ఆ ఏటీఎంలో డబ్బే లేదు కానీ.. రెండు రోజుల కిందట అందులో దాదాపు 28 లక్షల రూపాయలు వరకు డబ్బులు పెట్టినట్లు క్యాష్ నింపిన సంస్థ తెలియజేసింది. అయితే ఆ డబ్బు అంతా ఏమయింది అని సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. దీనితో అసలు నిజం బయటపడింది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు ఏటీఎం లోకి వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. ముందుగా వారు సీసీటీవీ ఫుటేజీని టేపుతో మూసివేసి తర్వాత చోరీకి పాల్పడినట్లు అర్థమవుతుంది. వాళ్ల ముఖాలకు మాస్క్ లు ఉండడంతో గుర్తించలేకపోయారు. వాస్తవానికి ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మే 23న చోరీ జరగడం జరిగింది.

 


20వ తారీఖున ఎటిఎంలో డబ్బులు సెట్ చేశారు అధికారులు. ఈ విషయంపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. వాస్తవానికి ఏటీఎంలో చోరీ చేసే వాళ్ళు జనరల్ గా గ్యాస్ కట్టర్ తీసుకుని బద్దలు కొడతారు. కానీ ఈ చోరీ అలా జరగలేదు ఏటీఎం ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదు. కానీ ఎటిఎం లోపల ఉండే డబ్బులు మొత్తం మటు మాయం అయిపోయాయి. ఈ చోరీ ఒక చిన్న హ్యాకింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఉండవచ్చు అంటూ పోలీసు అధికారులు వారి భావన. అలాంటి యంత్రం ద్వారా మరిన్ని చోరీలు జరిగే ప్రమాదం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. ఈ చోరీకి సంబంధించి డబ్బుని పై సంస్థల ఉద్యోగులకు కూడా సంబంధం ఉండి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం చోరీ ఎలా జరిగింది, ఎవరు చేసారు అన్న విషయం తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: