లోకంలో డబ్బుకున్న విలువ ఏ బంధానికి ఉండటం లేదు.. అదీగాక భార్యభర్తల మధ్య ప్రేమ కంటే డబ్బు ప్రాధాన్యతే ఎక్కువగా సంతరించుకుంటుంది.. ఇలాంటి నేపధ్యంలో ఒకరికి తెలియకుండా ఒకరు మోసం చేసుకోవడమో, లేదా చంపుకోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు.. ఆనందగా జీవించవలసిన బ్రతుకును జైలు గోడల మధ్య వెళ్లదీస్తున్నారు.. ఇక ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.. దాని వివరాలు తెలుసుకుంటే..

 

 

వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం హత్యా తండాకు చెందిన బాదావత్‌ వీరన్న ఇతని భార్య యాకమ్మతో కలసి ఓ ప్రైవేట్‌ పాఠశాలలో దోబీగా పనిచేసేవాడు. ఇక లాక్‌డౌన్‌ నేపధ్యంలో పాఠశాలను మూసివేయగా ఖాళీ మద్యం సీసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన వీరన్న భార్యను వేధించడం.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తుండటంతో ఇతని భార్య పలుమార్లు హెచ్చరించినా మార్పు రాలేదు. కాగా భర్తతో విసిగిన ఇతని భార్య హత్య చేయాలని నిర్ణయించుకుని, ఇందుకు వీరన్న సోదరి భూక్యా బుజ్జి, బావ భూక్యా బిచ్చాల సహకారం కోరింది. వారు అంగీకరించడంతో అందరూ కలసి వీరన్న హత్యకు రచించిన పథకంలో భాగంగా ఆ గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ.20 లక్షలకు వీరన్న పేరిట బీమా చేయించారు.

 

 

తర్వాత ఈనెల 19వ తేదీన నెక్కొండ ప్రాంతంలో సైకిల్‌పై ఖాళీ మద్యం సీసాలను విక్రయించేందుకు వీరన్న వెళ్లగా.. సమాచారం అందుకున్న భూక్యా బిచ్చా ఇతన్ని కలిసి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని హత్యాతండాకు వెళ్లుతున్న క్రమంలో మార్గమధ్యలో ఆగి మద్యం తాగి తమ వ్యవసాయ భూమి వద్దకు రాత్రి 11.45 గంటలకు తీసుకెళ్లగా.. అప్పటికే అక్కడ వీరన్న భార్య యాకమ్మ, సోదరి బుజ్జి ఉన్నారు. అందరూ కలసి వీరన్నకు ఉరి వేసి హత్య చేశారు. అంతే కాకుండా ఒకవేళ బ్రతికితే ఎలా అనే అనుమానంతో ముఖంపై బండరాయితో కొట్టి పక్కనే ఉన్న కెనాల్‌లో పడేశారు. అనంతరం బిచ్చా, బుజ్జి తమ స్వగ్రామానికి వెళ్లిపోగా.. యాకమ్మ తన భర్తను ఎవరో హత్య చేశారని నటించడం మొదలు పెట్టింది.

 

 

దీంతో పర్వతగిరి ఇన్‌స్పెక్టర్‌ పి.కిషన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి తమదైన శైలిలో విచారించగా ఈ హత్య తామే చేసినట్లుగా ఒప్పుకున్నారట.. దీంతో వీరందరిని అరెస్ట్ చేసి ఊచలు లెక్కపెట్టిస్తున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: