అచ్చు గుద్దినట్టు సినిమా కథలా పోలీసులు ఈ పెళ్ళిని ఆపేశారు. ఎలానో తెలిస్తే నిజంగా షాక్ అవ్వక తప్పదు. పోలీసులకి కేవలం వరుడి కుటుంబీకుల ఫోన్ నెంబర్ మాత్రమే తెలిసింది . ఆ వరుడి కుటుంబీకుల ఫోన్ నెంబర్ తోనే ఈ పెళ్లిని ఆపేసారు పోలీసులు.  గూగుల్ సహాయం తో ఓ బాల్య వివాహాన్ని పోలీసులు ఆపడం నిజంగా షాక్ .  అయితే కేవలం ఫోన్ నెంబర్ మాత్రమే తెలిసిన పోలీసులు రెండు బృందాల తో రంగం లోకి దిగారు . ఆ తర్వాత పెళ్లి ఎక్కడ అవుతుందని జాడ లేక బాల్య వివాహం మాత్రం ఖచ్చితంగా ఆపాలని వరుడు కుటుంబం నుంచి వచ్చిన ఫోన్ నెంబర్ సహాయం తోనే సమస్యని ఆపేసారు .

 

వరుడి తో పాటు ఇరు కుటుంబానికి సంబందించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ ఘటన మహారాష్ట్ర లోని దాంబవలి ఏరియా లో జరిగింది.  గూగుల్ సహాయం తో ఆ ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేసి పెళ్లి జరిగే చోటుని తెలుసుకున్నారు పోలీసులు . సాగర్ల గ్రామానికి పోలీసులు ఆ తర్వాత చేరుకున్నారు.  అక్కడ ఉన్న 26 ఏళ్ల వరుడి తో పాటు ఇరు కుటుంబాలకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు.

 

 

దీని పై బాల్య వివాహ చట్టం 2006 లోని తొమ్మిది , పది,  పదకొండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  బాలిక తల్లి దండ్రులు నిరుపేదలు. వాళ్ళు కూరగాయలు అమ్ముతూ జీవనాన్ని సాగిస్తున్నారు . ఆర్థిక పరిస్థితులు అంత బాగా లేనందు వలన ఈ వివాహం చేస్తున్నట్లు బాధ్యత తల్లిదండ్రులు తెలిపారు. ఏది ఏమైనా  బాల్య వివాహం తప్పు. ఇలా  అచ్చం సినిమా స్టోరీ లానే బాల్య వివాహాన్ని ఆపేసారు  పోలీసులు

 

మరింత సమాచారం తెలుసుకోండి: