ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రైతు శ్రేయస్సే రాష్ట్ర శ్రేయస్సు అని  రైతులకు అన్ని విధాలా సాయం చేస్తున్నారు. సన్న , చిన్న కారు రైతులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం ' వైఎస్సార్ రైతు భరోసా ' అనే పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలు విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసారు. రైతు భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సన్న , చిన్న కారు రైతులకు ఉచిత బోర్వెల్స్ కార్యక్రమం అమలు చేయబోతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. అయితే రైతులకు సంబంధించిన  అన్ని భూ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ పథకం ప్రకారం ఉచితంగా బోర్ వెల్స్ అందుబాటులోకి తెస్తారు. అయితే భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయరు అని స్పష్టం చేశారు.

 

 

 

దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులకు సంబంధించిన అర్హతల ను తెలియజేసింది. రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు , గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడొచ్చు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. ఈ అర్హతలు కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్ , ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్లైన్లో బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తరువాత దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. ఆ తరువాతే తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది. త్వరలోనే ఈ పథకం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తయితే చాలా మంది రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: