పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఒక యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు హైదరాబాద్ నగరానికి చెందిన లాయర్. అది చాలదన్నట్టు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం కూడా మొదలు పెట్టాడు. దీంతో అతడి వేధింపులు తాళలేక సదరు బాధితురాలు పోలీస్ స్టేషన్ ని శుక్రవారం రోజు ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం... సరూర్‌నగర్ సమీపంలోని లింగోజిగూడకు చెందిన బైడ్ సుభాష్(50) 2011-2014 సంవత్సరాలలో హైదరాబాద్ నగరంలోని ఓ కాలేజీలో ఎల్.ఎల్.బి చదివాడు. ఆ సమయంలోనే ఆ కాలేజీ లోనే ఓ యువతి లా విద్య అభ్యసించింది. ఐతే ఆమెకు స్కాలర్ షిప్ రాలేదు.
ఈ విషయం తెలుసుకున్న సుభాష్ తాను ఆర్థిక సాయం చేస్తానని ఆ యువతిని బాగా నమ్మించాడు. 2015 సంవత్సరంలో ఆ యువతిని తన ఫ్లాట్ కి తీసుకువెళ్లి మత్తు మందు కలిపిన బిర్యానీ ని ఆమెకు అందించాడు. అతడిని గుడ్డిగా నమ్మిన సదరు యువతి బిర్యానీ తిని ఆ తర్వాత నిద్ర లోకి జారుకుంది. ఆపై కామంతో కళ్లు మూసుకుపోయిన లాయర్ సుభాష్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే ఆమె నగ్నం గా ఉన్నప్పుడు ఫోటోలను తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించి ఆమెపై అనేకమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఒకానొక సమయంలో ఏకంగా ఆ యువతి ఇంట్లోనే ఆమెపై అఘాయిత్యం చేశాడు. తమ మధ్య ఉన్న విషయాన్ని ఎవరితోనూ చెప్పవద్దని... పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. మోజు తీర్చుకున్న తర్వాత ఆమెను 2019 సంవత్సరంలో విడిచిపెట్టాడు. ఇటీవల కాలంలో కూడా సుభాష్ ఆమెకు వాట్స్అప్ మెసేజ్లు పంపించి బాగా వేధించడంతో రాచకొండ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది సదరు యువతి. ఆమె ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఏది ఏమైనా నలుగురికి న్యాయం అందించాల్సిన న్యాయవాది అయ్యి ఉండి ఇలాంటి అకృత్యాలకు పాల్పడడం ప్రస్తుతం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి