కొచ్చి: దాదాపు 3 దశాబ్దాల క్రితం కొట్టాయం చర్చిలోని ఓ నన్ హత్యకు గురయ్యారు. అయితే ఆమె కేసు ఆనాటి నుంచి కొనసాగుతూనే ఉంది. సీబీఐ దీనిపై దర్యాప్తు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు(మంగళవారం) సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఆమె సేవ చేసిన చర్చిలోని ఫాదర్‌తో పాటు మరో నన్‌ను ఈ కేసులో దోషులుగా తీర్పు చెప్పింది.

1992లో కొట్టాయంలోని ఓ కాన్వెంట్ బావిలో అదే కాన్వెంట్‌కు చెందిన అభయ అనే 12వ తరగతి విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు పోలీసుల వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ కేసు ఆత్మహత్యగా గుర్తించి కేసు మూసేశారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని అనేక మంది ఆందోళనలు చేయడంతో కేసును సీబీఐకు అప్పగించారు. అయినప్పటికీ గత 28 ఏళ్లుగా ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఎట్టకేలకు ఈ కేసులో అన్ని ఆధారాలను పరిశీలించిన తరువాత సీబీఐ కోర్టు ఈ రోజు తన తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి సానల్ కుమార్ రేపు(బుధవారం) తీర్పు వెలువరిస్తారు.

సీబీఐ నివేదిక ప్రకారం.. చర్చిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి అభయ తెలుసుకుంది. అందుకే ఆమెను చంపేశారు. ఇద్దరు ఫాదర్‌లు, ఓ నన్ కలిసి ఈ హత్య చేశారు. అభయ తలపై బలమైన వస్తువుతో కొట్టిన తరువాత ఆమెను బావిలో పడేశారు.

ఇదిలా ఉంటే ఎట్టకేలకు ఈ కేసులో తీర్పు వెలువడడంతో అభయ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభయకు న్యాయం జరిగిందని, దోషులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు.

 అయితే అప్పటి నుంచి ఆ కేసు నడుస్తూనే ఉంది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ తీర్పు మాత్రం వాయిదా పడుతూనే ఉంది. చిట్టచివరికి 28 ఏళ్ల తరువాత మంగళవారం ఈ కేసులో సీబీఐ కోర్టు తిర్పు వెలువరించింది. అప్పటి చర్చి ఫాదర్ థామస్ కట్టూర్, చర్చిలోని మరో నన్ సిస్టర్ సేఫీలే అభయను అరెస్టు చేశారని, వారే అసలు దోషులని తేల్చి చెప్పింది. చర్చిలో వీరిద్దరూ అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్నట్లు అభయ గుర్తించిందని, అందుకే వారు ఆమెను చంపేశారని పేర్కొంది. వీరికి ఏ శిక్ష విధించబోయేదీ బుధవారం వెల్లడించనున్నట్లు సీబీఐ ధర్మాసనం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: