ఈ ఘటనపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడు జయేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి నిరాకరించడంతోనే కత్తితో దాడి చేశానని జయేశ్ అంగీకరించాడు. నిందితుడికి కఠిన శిక్ష అమలు చేయాలని మృతురాలి తండ్రితో పాటు పలువురు నాయకులు డిమాండ్ చేశారు.మహిళలపై ఏడాదికేడాది నేరాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఒక్క జూన్ నెలలోనే స్త్రీలపై నేరాలకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సిడబ్ల్యు)కు 2,043 ఫిర్యాదులందాయి. గత ఎనిమిది నెలల్లో అందిన ఫిర్యాదుల్లో ఈ సంఖ్యే గరిష్టం. ఎన్‌సిడబ్ల్యు డేటా ప్రకారం ఈ మొత్తం సంఖ్యలో అత్యధికంగా 'గౌరవంగా జీవించే హక్కు కింద (రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ)' 603 ఫిర్యాదులు అందాయి.
రెండోస్థానంలో గృహ హింసకు సంబంధించిన 452 ఫిర్యాదులున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 2,378 ఫిర్యాదులు అందగా... ఆ తరువాత గత నెలలో నమోదైన కేసుల సంఖ్యే అత్యధికం. భారతావనిలో మహిళలపై అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన ఈ గణాంకాలు అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2018తో పోలిస్తే, 2019లో దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగాయలని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2019లో దేశంలో 87 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయనీ..2020లో మహిళలపై పాల్పడిన నేరాలకు సంబంధించి 4.05 లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. గతం కంటే అత్యాచారాలు 7.3శాతం పెరిగాయని తెలిపింది. అంటే ఏడాది ఏడాదికి అత్యాచారాలు పెరుగుతున్నాయని తేటతెల్లమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి