ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ మంచి పనులు చేయడం కన్నా కూడా సంఘ వ్యతిరేఖ చర్యల కు పాల్పడుతున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై ప్రతి పక్షాలు కూడా తమదైన శైలి లో విమర్శలు గుప్పిస్తున్నారు. వాలంటీర్ల దురాగతాలు గతంలో చాలానే వెలుగు చూశాయి.. అయిన ప్రభుత్వం మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తోంది.. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు గుంజాడు.. చివరికి దుకాన్ సర్దేసాడు.. 


వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కురిచేడులో ఓ కంత్రీ వలంటీర్ వ్యవహారాలు వెలుగు లోకి వచ్చాయి. స్థానిక ఎస్సై, పంచాయతీ కార్యదర్శి సీట్ల లో కూర్చుని ఫోటోల కు ఫోజులిస్తున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కురిచేడు లో వలంటీర్ ‌గా పనిచేస్తున్న అలహరి అఖిల్.. గతం లో కూడా పలు కేసుల లో నిందితుడిగా ఉన్నాడు. పని నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల కు వెళ్లిన అతను అక్కడ పోజ్ కొడుతూ ఫోటోలు దిగాడు. 


2018లో రాజమండ్రి లో ఓ మహిళ తో కలిసి సబ్ కలెక్టర్ పేరుతో బంగారు షాపు వారిని బురిడీ కొట్టించే యత్నం చేశాడు. షాపు సిబ్బంది అనుమానించి పోలీసులకు సమాచారం ఇవ్వడం తో మోసం బట్టబయలైంది. ఆ క్రమంలో సదరు వాలంటీర్ పై కేసు నమోదు అయింది. కురిచేడులోను బ్యాంక్ యాప్ ద్వారా ఓ మహిళ ఖాతా నుంచి 2.50 లక్షల నగదును అఖిల్ మాయం చేశాడు. పలువురి వద్ద రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ భారీగా నగదును అఖిల్ వసూలు చేశాడు.. అతను చేస్తున్న మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. అతన్ని రుజువుల తో సహా పట్టుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు తో కేసును అనేక కోణాల్లో విచారణ చేపట్టారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: