కరోనా విపత్కర పరిస్థితుల్లో డబ్బు మీద పిచ్చి తో చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బుల కోసం యువతుల నగ్న చిత్రాలను ఆన్ లైన్ లో పెట్టీ వ్యభిచార కార్యకలాపాలు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆన్ లైన్ లో వ్యభిచారం చేయిస్తున్నారు. లక్షల కొద్దీ డబ్బులను సంపాదిస్తున్నారు.. పోలీసులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు.. ఇప్పుడు పోలీసులు ఇలాంటి ఘటనల పై ప్రత్యేక నిఘా పెట్టే పనిలో ఉన్నారు.. కరోనా నిబంధనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఆన్ లైన్ లో యువతుల నగ్న చిత్రాలను పెట్టీ వ్యభిచారం చేయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. 


యువతుల అర్ధనగ్న చిత్రాలను పొందుపరిచి ఆన్‌లైన్‌ వ్యభిచార కలాపాలను సాగిస్తున్న ఓ సినీ ప్రొడక్షన్‌ మేనేజర్‌ను మంగళవారం సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద రెండు చరవాణిలు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సీతారాం కథనం ప్రకారం సత్తుపల్లికి చెందిన బోడపాటి సుధీర్‌ పదేళ్ల క్రితం నగరానికి వచ్చి సినీ ప్రొడక్షన్‌లో మేనేజర్‌గా చేరాడు. అప్పుడు ఆదాయాన్ని ఎక్కువగా సంపాదించే వాడు.. మాదాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదాయం సరిపోకపోవడంతో అడ్డదారిలో సంపాదించాలని అనుకున్నాడు. 


అయితే సులువుగా సంపాదించేందుకు అదే రంగంలోని తెలిసిన కొంత మంది యువతులతో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వేదికగా ఆన్‌లైన్‌లో 'లోక్యాంటో' డేటింగ్‌ వెబ్‌సైట్‌ను ఆరు నెలలుగా నిర్వహిస్తున్నాడు.అందులో అర్ధనగ్న ఫొటోలు పొందుపరిచి విటులను ఆకర్షిస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో రాచకొండ యాంటి హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ విభాగం, సరూర్‌నగర్‌ పోలీసులు వెబ్‌సైట్‌పై నిఘా పెట్టి మంగళవారం దిల్‌సుఖ్‌నగర్‌లో విటుడి కోసం వేచి చూస్తుండగా సుధీర్ ను అదుపులోకి తీసుకున్నారు.. అతని పై కేసు నమోదు చేసుకొని, నగదు, సేల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: