ధామా టేల్స్ బ్యానర్ పై ఆకర్ష ఆలపాటి సమర్పణలో నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వం చేయగా ఆకర్ష ఆలపాటి నిర్మాతగా రానున్న చిత్రం 'మెస్సి - లవ్ ఫ్రమ్ ఇండియా'. ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో జమునా అబ్దు రెహ్మాన్, విజయన్ , సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫైజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జేమ్స్ బిజాయ్ సంగీతం అందించారు. నౌఫల్ అబ్దుల్లా ఎడిటింగ్ చేయగా అశోక్ మల్లికార్జున విఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ & టైటిల్ గ్లింప్స్ స్కూల్ పిల్లల చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది. నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత ఆకర్ష ఆలపాటి మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. మా చిత్ర గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను నా చిన్నతనం నుండి క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటాను. ఇదే మార్గంలో చిన్న వారిని బాగా ప్రోత్సహించాలని అనుకున్నాను. అదే విధంగా మలయాళ చిత్రమైన మెస్సి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాను. ఈ సినిమా కోసం నాకు సపోర్ట్ గా నిలిచిన నా బృందం అందరికీ థాంక్స్. మా దగ్గర మరిన్ని వినూత్న ఆలోచనలు ఉన్నాయి, ఇటువంటి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయనున్నాము. పీవీఆర్ ఉదయ్, వెంకట్ మంచి గారు మాకు మంచి సపోర్ట్ అందించారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14వ తేదీన మెస్సి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నాము. ప్రేక్షకులు సినిమాను ఆదరించి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరవింద్ బత్తిని మాట్లాడుతూ... "మా సినిమాకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ థాంక్స్. మా సినిమాను అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.

అర్జున్ మాట్లాడుతూ... "నేను ఈ కార్యక్రమానికి వచ్చిన మొదటి కారణం ఆకర్ష. మెస్సి సినిమా గురించి చెప్పాలి అంటే ప్లేయర్ ఎలా బాగా ఆడతారు అలాగే సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ ఇచ్చిన మీడియాకు థాంక్స్. ధామా టేల్స్ నుండి రానున్న ఈ సినిమా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ధామా టేల్స్ కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ మరింత ముందుకు వెళ్లనుంది" అన్నారు.

నటీనటులు : ఆంటోని వర్గీస్, జమునా అబ్దు రెహ్మాన్, విజయన్ , సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్ తదితరులు.

సాంకేతిక బృందం :
బ్యానర్ : ధామా టేల్స్
నిర్మాత : ఆకర్ష ఆలపాటి
దర్శకత్వం : నిఖిల్ ప్రేమ్ రాజ్
సినిమాటోగ్రఫీ : ఫైజ్ సిద్ధిక్
సంగీతం : జేమ్స్ బిజాయ్
ఎడిటర్ : నౌఫల్ అబ్దుల్లా
విఎఫ్ఎక్స్ : అశోక్ మల్లికార్జున
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అరవింద్ బత్తిని

మరింత సమాచారం తెలుసుకోండి: