నెల్లూరులో దిశ యాప్ తో అద్భుతం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం కి చెందిన ఓ యువతి శ్రీ సిటీ లో ఉద్యోగం చేస్తూ సూళ్లూరపేటలో నివాసం ఉంటోంది. అయితే యువతి సొంత గ్రామం ఊరు మార్కాపురం వెళ్లి శనివారం సూళ్లూరుపేట కు బయలు దేరింది. రాత్రి 9:25 గంటల ప్రాంతంలో నాయుడుపేటకు చేరింది. అనంతరం యువతి సోలూరుపేట వెళ్లేందుకు 10 గంటల 30 నిమిషాల వరకు ఎదురుచూసినా బస్సు రాలేదు దాంతో బస్టాండ్ నుంచి బయటకు వచ్చి ఒక ఆటోను పిలిచింది. తాను ఒంటరిగా వెళ్ళలేక ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లాలని డ్రైవర్ ను కోరింది.

దాంతో హైవే దగ్గరికి వెళ్ళాక ప్రయాణికులను ఎక్కించుకుంటా అని డ్రైవర్ చెప్పాడు. కానీ డ్రైవర్ ప్రయాణికులకు ఎక్కించుకాకుండా ఒక్కసారిగా ఆటో స్పీడ్ పెంచాడు. దాంతో డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి భయంతో వెంటనే దిశ యాప్ లోని ఎస్ఓఎస్ బటన్ ను క్లిక్ చేసింది. యువతి 10:38  గంటలకు ఎస్ఓఎస్ బటన్ ను క్లిక్ చేయగా 10:40 గంటలకు బాధిత యువతికి పోలీసులు ఫోన్ చేసి మాట్లాడారు. ఏమీ బయపడవద్ధని తాము వస్తున్నామని ఫోన్ లో ధైర్యం చెప్పారు. అనంతరం దొరవారిసత్రం పోలీసు సిబ్బంది, పెట్రోలింగ్ సిబ్బంది 10:40 గంటలకు యువతి వద్దకు చేరుకున్నారు
 అయితే డ్రైవర్ అప్పటికే యువతిని ఆటో నుండి దింపేసి అక్కడ నుండి పరార్ అయ్యాడు. 

దాంతో పోలీసులు యువతికి దైర్యం చెప్పి తమ వాహనంలో ఎక్కించుకొని సురక్షితంగా బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. అయితే ఇదంతా నిమిషాల్లోనే జరిగిపోయింది. యువతి రిక్వెస్ట్ కు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకుని రక్షించిన పోలీసుల పై డీఐజీ   ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవల ఏపీలో మహిళలు, యువతుల పై దారుణాలు ఎక్కువ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ దిశ యాప్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవలే సీఎం జగన్ దిశ యాప్ పై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దిశ యాప్ యువతులకు, మహిళలకు అన్న లాగా పనిచేస్తుందని  చెప్పారు. ఇక తాజాగా నెల్లూరు ఘటనలో దిశ యాప్ ఆ యువతికి అన్నలాగే పనిచేసి రక్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: