ఆడపిల్లలపై ఉన్న వివక్ష ధోరణి ఇంకా ఎప్పుడు మారుతుందో.  ఆడపిల్ల ఇంకా ఇష్టం వచ్చినట్లుగా ఈ సభ్య సమాజంలో బతికే హక్కే లేదు అన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తూ అనాగరిక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇలా ఆడపిల్ల సభ్య సమాజంలో అడుగడుగునా ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు జరగడానికి వారు వేసుకునే బట్టలే కారణమని..  అలాంటి బట్టలు వేసుకుంటే అత్యాచారాలు జరుగుతాయి అంటూ ఇప్పటికే ఎంతోమంది సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆడపిల్ల ఎలాంటి బట్టలు వేసుకోవాలి.. ఎలా నడవాలి.. ఎలా చూడాలి అన్న విషయాలను కూడా పరాయి వ్యక్తి  డిసైడ్ చేస్తూ ఉంటారు నేటి రోజుల్లో.



 చాలా మంది మహిళలు ఇలాంటి మాటలు పట్టించుకోకుండా లైఫ్ లో ముందుకు సాగుతుంటారు. అయితే ఎవరూ ఎల్లయ్యో.. పుల్లయ్యో ఇలాంటి మాటలు అని ఉంటే పట్టించుకునేవారు కాదేమో.. కానీ ఎక్కడో ఒక బాధ్యత గల వ్యక్తి అన్న మాటలు మాత్రం ప్రతి ఒక్క ఆడపిల్లను బాధ పెడుతున్నాయ్. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఎంతో మంది విద్యార్థులకు విద్యా బోధన చేసి మేధో సంపత్తిని పంచాల్సిన హెడ్మాస్టర్. ఒక స్కూల్ కి పెద్దగా ఉండి హెడ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు పాలు అవుతున్నాయి.  సాధారణంగా టీచర్స్ డే అంటే చాలు అటు విద్యార్థులు ఎంతో ఘనం గా జరుపుకుంటారు.



 కానీ ఇటీవలే టీచర్స్ డే రోజున ప్రధానోపాధ్యాయుడు మాట్లాడిన తీరు ఆ విద్యార్థులకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది.  టీచర్స్ డే సందర్భంగా యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ లో వచ్చిన విద్యార్థినులపై హెడ్మాస్టర్ అనుచిత వ్యాఖ్యలు చేసాడు. మధ్యప్రదేశ్ లోని మచల్ పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  రంగుల దుస్తుల్లో వచ్చి అబ్బాయిలను చెడగొడుతున్నారు.. రేపటి నుంచి బట్టలు వేసుకోకుండానే బడికి రండి అంటూ అసభ్యకరంగా విద్యార్థులతో మాట్లాడారు హెడ్మాస్టర్. హెడ్మాస్టర్ మాటలతో అవాక్కయిన విద్యార్థులు ఇక భారీగా ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హెడ్మాస్టర్ రాధేశ్యాం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: