ఉన్నత చదువులు చదివారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కూడా పని చేస్తున్నాడు.. మంచి జీతం కూడా వస్తుంది కానీ ఎంతో సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో అతని మదిలో ఒక ఆలోచన తట్టింది. దీంతో డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. మాట్రిమోని సైట్ లనే తన ఆయుధం గా మార్చుకున్నాడు. ఎంతో మంది యువతులతో పరిచయాలు పెంచుకొని మోసాలకు పాల్పడ్డాడు. ఇక ఇటీవలే పోలీసులకు దొరికిపోయాడు. ఇక ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కి చెందిన శ్రీనివాస్ ఎంసీఏ పూర్తి చేశాడు. అతనికి మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా వచ్చింది. అయితే 2017 సంవత్సరంలో మాట్రిమోనిలో తన ఫోటో పెట్టాడు. ఓ యువతిని పరిచయం చేసుకుని ఆన్లైన్లో చాటింగ్ చేసి డబ్బులు గుంజాడు. అప్పటి నుంచి అతని ఆలోచన తీరు మారిపోయింది. ఇక అప్పటి నుంచీ అదే పనిగా పెట్టుకున్నాడు. అయితే అతనికి బట్టతల ఉన్న విషయాన్ని కూడా దాచి పెట్టి విగ్గు పెట్టుకుని మరీ స్టైలిష్గా ఫోటోలు దిగి అమ్మాయిలను ఆకర్షించడం మొదలుపెట్టాడు. మాయ మాటలతో నమ్మించి ఇక బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసుకొనే వాడు. ఇలా 2017 లో ఓ యువతి దగ్గర నుంచి 27 లక్షలు.. 2018లో మరో యువతి దగ్గర నుంచి నలభై లక్షలు కాజేశాడు.అప్పుడే పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. ఇక బయటికి వచ్చిన తీరు మార్చుకోలేదు. ఇక ఇటీవలే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నాలుగు కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తూ చివరికి రెడ్హ్యాండెడ్ గా బుక్కై కటకటాల వెనక్కి వెళ్ళాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి