కానీ ఇక్కడ ఒక తండ్రి మాత్రం కూతురి విషయంలో దారుణంగా ప్రవర్తించాడు. మూడేళ్ల చిన్నారి కూతురు విషయంలో ఆ తండ్రి ప్రవర్తించిన తీరు ప్రస్తుతం అందరిని ఆగ్రహావేశాలకు గురి చేస్తుంది. ఏకంగా వయసు మూడేళ్లే అని కూడా చూడకుండా దారుణంగా కూతురు పై దాడి చేశాడు. విచక్షణ రహితంగా చిన్నారిని చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చిన్నారి కూతురుని తండ్రి కర్కశంగా కొడుతూఉంటే ఇక పక్కింటి వారు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అన్నం తినలేదు అన్న కారణంతో తండ్రి నాగరాజు గగన శ్రీ అనే మూడు ఏళ్ల చిన్నారిని దారుణంగా హింసించాడు. ఏకంగా రెచ్చిపోయి తాడుతో దాడి చేశాడు చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణంగా కొట్టాడు. అయితే కూతురుని భర్త ఇలా కొడుతుంటే పక్కనే ఉన్న భార్య అడ్డుకోక పోగా వెకిలి నవ్వులు నవ్వింది. ఇక భార్య లోపలికి వెళ్లగానే మరింత రెచ్చిపోయాడు నాగరాజు. చిన్నారి మెడ పట్టుకుని పైకి లేపి కింద పడేసాడు. ఇలా కన్న తండ్రి చిన్నారిని దారుణంగా కొడుతూ ఉంటే వీడియో చూస్తున్న వారి మనసే కరిగి పోతుంది కానీ ఆ తండ్రికి అసలు ఎలా మనసు వచ్చింది అంటూ ఈ వీడియో చూసిన వారు కామెంట్లు పెడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి