ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు . ప్రేమించమని వెంట పడ్డాడు ..చివరకు ఆమెను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నటుంది ఆమెను ఏలుకోను పో అన్నాడు. వెంటనే ముఖం చాటేశాడు. భర్త చేసిన పనికి ఒక్కసారిగా కంగు తిన్న ఆమె. అతడిని నాతప్పు ఏమిటో చెప్పాలని నిలదీసింది . కానీ అతడు అసలు విషయం చెప్పకుండా దాటేశాడు. భర్త లో ఈ మార్పును అర్ధం చేసుకోలేని ఆ భార్య వెంటనే తన అత్తా మామలకు ఈ విషయం చెబుదామని బయలుదేరింది. తన అత్తమామలకు ఈ విషయాన్నీ చెప్పింది. కానీ అత్తమామలు ఆమెను మెడపట్టి బయటకు గెంటివేశారు. దిక్కు తోచని స్థితిలో ఆమె తన తల్లికి ఈ విషయాన్నీ చెప్పగా ఆమె కూడా తన వియంకులతో మాట్లాడే ప్రయత్నం చేసింది కానీ ఆమెనుకూడా వారు పట్టించుకోలేదు. చేసేది ఏమిలేక తల్లి కూతురులు త్తారింటిముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తున్నారు.

వివరాలలోకి వెళితే ..విశాఖ జిల్లా మకరవరపాలెం మండలం లోని పైడి పాల గ్రామానికి చెందిన ఉద్యోగస్తుడు నాగేంద్ర ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. సాయి అనే యువతిని నాగేంద్ర  ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . పెళ్లి చేసుకున్నప్పటినుండి సాయి తో నాగేంద్ర కాపురం చేయడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యం లో తన అత్తవారికి ఈ విషయాన్ని తెలుపగా వారుకూడా ఆ యువతిని మెడపట్టి గెంటేశారు. దిక్కు తోచని స్థితిలో సాయి తన తల్లి తో కలసి నాగేంద్ర ఇంటి ముందు టెంట్ వేసి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తోంది . తనని కాపురానికి రానివ్వకపోతే తనకు చావే శరణ్యం అంటోంది బాధితురాలు సాయి. బాధితురాలు ఇప్పటికే మాకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి న్యాయం చేయవలసిందిగా పొలిసు అధికారులను కోరింది. ఆమె మామ తనని నిర్లక్ష్యంగా మెడ పట్టి గెంటేశారని , తనకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరింది.
మరింత సమాచారం తెలుసుకోండి: