సొంతింటిని నిర్మించుకోవాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ కలను సాకారం చేసుకోవడానికి ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఇద్దరు దంపతులు సొంతింటిని నిర్మించుకోవాలనే కలను సాకారం చేసుకున్నారు. తమ ఇష్టానికి అనుగుణంగానే ఇక ఇంటిని నిర్మించుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతో సంతోషంగా గృహప్రవేశం చేసేందుకు బంధుమిత్రులందరికీ పిలిచారు. ఇక గృహప్రవేశం కూడా పూర్తి చేశారు. కానీ మర్నాడు ఏం జరిగిందో తెలియదు గానీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా  మారిపోయింది. ఇక ఈ ఘటన కాస్త ఇరు కుటుంబాల్లో కూడా తీరని విషాదాన్ని నింపింది. లక్నోలోని గోమతి నగర్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.


 గోమతి నగర్ లోని ఫేస్ టూ లో చోటు చేసుకోగా స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే రామ్ కిషోర్, శ్యామ్ కిషోర్, బ్రిజ్ కిషోర్ అనే ముగ్గురు అన్నదమ్ములు చిన్న ఇంట్లో ఉమ్మడి కుటుంబం గా ఉండేవారు. వ్యాపారం బాగా డెవలప్ కావడంతో వీరందరూ కలిసి నాలుగు అంతస్తుల కట్టుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షాప్ పెట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది మిత్రులందరి సమక్షంలో ఎంతో ఘనంగా గృహప్రవేశం నిర్వహించారు. ఇక ఈ గృహ ప్రవేశం అయిపోయిన తర్వాత రాత్రి గదిలోకి వెళ్ళి పడుకున్నారు.


 ఉదయం అందరూ లేచారు కానీ శ్యామ్ కిషోర్ దంపతులు మాత్రం ఎంత టైం అయినా  కూడా బయటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా శ్యామ్ కిషోర్ నట్టింట్లో ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఇక అంతలోనే బెడ్ పై భార్య విగతజీవిగా కనిపించింది. ఇక ఆ పక్కనే తొమ్మిదేళ్ల కూతురు తల్లి దగ్గర ఏడుస్తూ కనిపించింది. అయితే అప్పటికే గృహప్రవేశానికి వచ్చిన బంధువులు అందరూ ఇంట్లోనే ఉన్నారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: