నాగరిక సమాజం లోకి అడుగుపెడుతున్న మనిషిలో మానవత్వం అనేది మాత్రం రోజురోజుకూ కనుమరుగై పోతుంది అని అర్థమవుతుంది. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషి మానవ బంధాలను మర్చిపోయి దారుణంగా వ్యవహరిస్తున్నాడు నేటి రోజుల్లో. ఆస్తులకు అంతస్తులకు ఇస్తున్న విలువ కనీసం బంధాలకు బంధుత్వాలకు మాత్రం ఇవ్వలేకపోతున్నారూ అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది ఆస్తుల కోసం ఏకంగా సొంత వారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా సభ్యసమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.


 అంతేకాదు ఎలాగైనా ఆస్తిని చేజిక్కించుకోవాలనే ఆశతో ఏకంగా కని పెంచిన తల్లిదండ్రుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు ఎవరు. ఇలా నేటి రోజుల్లో మనుషుల్లో బంధాలు బంధుత్వాలు కు విలువ తగ్గిపోయింది అనే దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. బతికున్నప్పుడు తల్లి మీద ప్రేమ చూపించని ఇద్దరు కొడుకులు చనిపోయిన తర్వాత మాత్రం తల్లి ఆస్తి మీద కన్నేశారు. ఈ క్రమంలోనే ఏకంగా తల్లి అంత్యక్రియల్లో కన్నీళ్లు పెట్టుకోవడం మానేసి ఆస్తి కోసం కొట్టుకోవడం మొదలు పెట్టారు.


 ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. యశోద భూమిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక భూమి రెడ్డి పేరు మీద ఉన్న పొలం ని ఇద్దరు కుమారులు మీద రాసిచ్చేశాడు. కొంత భూమిని తన వద్దనే ఉంచుకున్నాడు భూమిరెడ్డి. అయితే తండ్రి కొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చేవి. ఇకపోతే ఇటీవల తల్లి యశోద అనారోగ్యంతో కన్నుమూసింది. అయితే కని పెంచిన తల్లి చనిపోయింది అన్న బాధ కంటే ఆస్తి ఎవరికి వెళ్తుందో అన్న భయం కొడుకులిద్దరిలో నిండి పోయింది. ఈ క్రమంలోనే తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆస్తుల కోసం తల్లి శవం వద్ద కొట్టుకున్నారు  ఇద్దరు కొడుకులు. ఇక చివరికి ఇద్దరూ పోటీపడి మరీ తలకొరివి పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: