కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత విద్యారంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు విద్యార్థులందరూ నేను గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగం సాధించాలి అనుకునేవారు. నేను ఒక పెద్ద ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి అని కలలు కనేవారు. కాని కరోనా వైరస్ వచ్చిన తర్వాత విద్యార్థులు అందరికీ నిరాశే ఎదురవుతుంది.. ఎందుకంటే వరుసగా కళాశాలలు మూత పడుతుండటం కేవలం ఆన్లైన్ క్లాసులు ద్వారా మాత్రమే విద్యాబోధన జరుగుతూ ఉండడంతో.. ఎంతోమంది విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు.


 ఇక ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాసులు చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోలేక.. చివరికి చదువుపై ఆసక్తి కోల్పోతున్నారు.. ఇక ఇలా ఆన్లైన్ క్లాసులు ఒత్తిడితో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.. ఆన్లైన్ క్లాసుల తో ఒకే గదికి పరిమితం అయ్యానని ఇక ఇలాంటి జీవితంతో విసిగిపోయానాని జీవం లేని జీవితం కొనసాగించలేను అంటూ చెబుతూ ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం తో తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. ఈ విషాదకర ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో వెలుగులోకి వచ్చింది.


 దాదాపు రెండేళ్ల నుంచి ఒకే గదికి పరిమితం కావడం ఆన్లైన్ క్లాసులు డెడ్లైన్లు మార్కులు ఇలా అన్ని విషయాలు తన మరణానికి కారణం అవుతున్నాయ్ అంటూ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒక లేఖ రాశాడు సదరు యువకుడు. ప్రమోద్ కుమార్ వరంగల్ ఎన్ఐఐటి లో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల నుంచి వైరస్ కారణంగా ఆన్లైన్లో తరగతులు జరుగుతున్నాయి. ఇంటినుంచే తరగతులకు హాజరు అవుతూ వస్తున్నాడు ప్రమోద్ కుమార్. ఇక చదువులో ఎప్పుడూ ముందుండే ప్రమోద్ కుమార్  ఇటీవలే అన్ని ప్రాజెక్టుల్లో కూడా ఏ గ్రేడ్  సాధించాడు. వచ్చే నెలలో జరగబోయే గేట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఒత్తిడితో కూడిన జీవితం నాకు వద్దు అంటూ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఇక కొడుకు తలుపు తీయకపోవడంతో ఒక్కసారిగా బద్దలుకొట్టి చూడగా ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించిన కొడుకును చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: