ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రస్తుతం ఏది కావాలన్నా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో దొరుకుతుంది. వేసుకునే చెప్పులు దగ్గర నుంచి తినే ఆహారం వరకు అన్ని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటూ డోర్ డెలివరీ పొందుతున్నారు నేటి రోజుల్లో జనాలు. అదే సమయంలో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు కూడా ప్రస్తుతం ఆన్లైన్లోనే జరుగుతూ ఉండటం గమనార్హం. ఇక ఇలాంటి ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు అటు ఎన్నో రకాల యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే టెక్నాలజీ పెరిగి పోయి అన్నీ అర చేతిలో ఉన్న ఫోన్లోనే దొరుకుతూ ఉన్నప్పటికీ  ఎంతోమంది స్మార్ట్ఫోన్ లు ఉపయోగించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కడ ఏ లింక్ ఓపెన్ చేస్తే సైబర్ ఎటాక్ జరిగి ఖాతా ఖాళీ అయిపోతుందో అని భయపడి పోతున్నారు అందరు. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ సైబర్ నేరగాళ్లకు షాక్ ఇస్తున్నప్పటికీ అటు సైబర్ నేరగాళ్లు మాత్రం నేరాలకు పాల్పడడం లో కొత్త పుంతలు తొక్కుతూ ఉండడం గమనార్హం. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది అమాయకులనె టార్గెట్గా చేసుకొని ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇటీవలే ఆన్లైన్ లో మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాడు సదరు వ్యక్తి. కానీ రీఛార్జ్ పూర్తయిన నిమిషాల వ్యవధిలోనే ఖాతాలో ఉన్న 40 వేలకు పైగా నగదు మాయం అయింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.


 ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ధర్మారం లో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన భగవాన్ రెడ్డి ఈనెల 4వ తేదీన ఫోన్ రీఛార్జ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇక ఆ యాప్ వేదికగానే రీఛార్జ్ ను విజయవంతంగా పూర్తి చేశాడు. మొదటిసారి రీఛార్జ్ అయ్యింది కానీ రెండవ సారి మాత్రం రీఛార్జ్ అవ్వలేదు. దీంతో కస్టమర్ కేర్ నెంబర్ కి ఫోన్ చేసి సమస్య ఏంటి అని అడిగాడు. ఈ క్రమంలోనే పది రూపాయలు రీఛార్జ్ చేయాలి అంటూ కస్టమర్ కేర్ ను  కోరాడు. ఇక ఇలా రీఛార్జి కూడా పూర్తయింది. కానీ ఆ తర్వాత అకౌంట్లో చెక్ చేసుకుంటే 41 వేలకు పైగా నగదు మాయం అయింది. దీంతో మోసపోయానని గ్రహించిన అతను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: