మూడుముళ్ల బంధంతో ఒక్కటైన భార్య భర్తల అనుబంధం అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఒకరి పట్ల ఒకరు అమితమైన ప్రేమను చూపించుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇదంతా కేవలం నేటి రోజుల్లో మాటల్లో మాత్రమే వినిపిస్తుంది . వాస్తవాల్లోకి వెళితే మూడుముళ్ల బంధంతో ఒక్కటైన దంపతులు అన్యోన్యంగా కాదు బద్ద శత్రువులు గా కనిపిస్తున్నారు అనే చెప్పాలి. భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే గుణం లేకపోవడం ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేకపోవడం.. ఇక ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించకపోవడం వెరసి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం చిన్నపాటి గొడవలు ఎన్నో అనర్థాలకు దారి తీయడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి.



 దీంతో తరచూ మనస్పర్ధలు తో గొడవలు పడుతున్నా ఎంతో మంది భార్యాభర్తలు విడాకులతో వేరు పడడం చేస్తున్నారు. ఇక మరికొంతమంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. చిన్నపాటి గొడవలతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భర్తతో గొడవ పడిన వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిజాంబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.



 నిజాంబాద్ రూరల్ మండలం అశోక్ ఫారం గ్రామానికి చెందిన పావని అనే 32 ఏళ్ల వివాహిత ఇటీవలే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పావని భరత్ మధ్య ఇటీవలి కాలంలో తరచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. దీంతో సంతోషం లేని ఈ జీవితంలో ఇక బ్రతికి వృధా అనుకుంది పావని. తీవ్ర మనోవేదనకు గురై ఎవరు ఇంట్లో లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: