మనిషి పుట్టిన నాటినుంచీ ప్రతిరోజు మనిషి మృత్యువుతో పోరాటం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి మృత్యువు  కబలిస్తుందో  అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది  అందుకే రేపు బాగుంటుంది అనే ఆశతో ప్రతి మనిషి కూడా బ్రతుకు పోరాటం సాగిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు అనుకోని విధంగా మృత్యువు కబళించింది. అనంత లోకాలకు తీసుకు వెళుతూ ఉంటుంది. ఇలా అనుకోని ఘటనలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతూ ఉంటాయి.


 కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రులను దూరం చేసి పిల్లలను అనాధ గా మార్చి ఆనందపడే విధి.. మరికొన్నిసార్లు పిల్లలను దూరం చేసి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు దూరమవడంతో ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. ఈ ఘటన అందరినీ కంట తడి పెట్టించింది అని చెప్పాలి. రాజమహేంద్రవరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వద్దంటే వెళ్ళాడు ఇంకా ఎప్పుడు వస్తాడో ఏమో అంటూ ఆ తల్లి ఎదురు చూడటం మొదలుపెట్టింది.


 కానీ కొడుకు రాలేదు కొడుకు మరణ వార్త ఇంటికి వచ్చింది. దీంతో ఆ తల్లి గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. గుండెలవిసేలా రోదించింది. తాడేపల్లిగూడెం కి చెందిన డ్రైవర్ గోపికృష్ణ వెంకటలక్ష్మికి ఇద్దరు పిల్లలు వెంకటలక్ష్మి గృహప్రవేశానికి చిన్న కొడుకు చరణ్ తేజ్ తో కలిసి రాజమహేంద్రవరం వచ్చాడు. అయితే ఇటీవలే వరుసకు సోదరుడైన సాయి తో కలిసి చరణ్ తేజ్ పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో స్నానానికి వెళ్ళాడు. అయితే ఇలా వెళుతున్న సమయంలో వద్దు అంటూ తల్లి వారించినా వినలేదు. ఆ తర్వాత కొడుకు తిరిగి వస్తాడు అని ఆశగా ఎదురుచూస్తుంది ఆ తల్లి. కానీ కొడుకు మరణ వార్త చెవిన పడింది దీంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: