ఆమె ఓ దివ్యాంగురాలు.. ఆమెను చూసి ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. దీంతో ఆ దివ్యాంగురాలు ఎంతగానో సంతోష పడిపోయింది. ఇక జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంది.  నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అని ఆ యువకుడు చెప్పిన సమయంలో ఆ యువతి మనసు పులకరించి పోయింది. ఆ యువకుడిని నమ్మి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది దివ్యాంగురాలు. కానీ చివరికి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటూ చెప్పిన ఆ యువకుడు ప్లేట్ ఫిరాయిస్తాడు అని మాత్రం ఊహించలేకపోయింది.


 పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి యువకుడిపై ఒత్తిడి తీసుకు వచ్చింది. దీంతో ఇక ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.. అంతకుముందు ఆమెపై లైంగిక వాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు.ఈ క్రమంలోనే మాయమాటలు చెప్పి ఓ రోజు రాత్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక ఆ దివ్యాంగురాలు ప్రతిఘటించటంతో l నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు చివరికి మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు వదిలింది.


 ఈ ఘటన నారాయణపేట జిల్లా మద్దూర్ లో వెలుగులోకి వచ్చింది. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్ లోని ఉప్పర్ పల్లి లో పనిచేసుకుంటూ జీవిస్తోంది. ఇక వెంకట్ రాములు అనే యువకుడు కూడా అదే ప్రాంతంలో పని చేస్తున్నాడు. ఇక వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ ఆ యువతిని నమ్మించిన  వెంకట్ రాములు ఇక ఇటీవల మాయమాటలతో యువతిని హైదరాబాద్ నుంచి మద్దూరు తీసుకొచ్చి ఒక గదిలో పెట్టాడు. రోజులు గడుస్తున్న పెళ్లి మాట ఎత్తకపోవడం తో  వెంకట్రావుపై పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది ఆ యువతి. దీంతో లైంగిక వాంఛ తీర్చుకొని  వదిలేయాలి అనుకుని  చివరికి నిప్పంటించాడు. 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన యువతి చివరికి మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు వదిలింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: