పిల్లలు ఏది కావాలంటే అదే మొండిగా పట్టుకుంటారు.. వారికి ఇష్టమైనది. తీసుకు రావాలని లేకుంటే అన్నం తినమని మారామ్ చేస్తారు. కొన్ని సార్లు ఏదైనా చేస్తారు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచె సరైన దారిలో పెట్టాలని పెద్దలు పదే పదే చెబుతున్నారు. చిన్న వయస్సు తెలిసి తెలియని మనసు చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలొచిస్తారు. దాంతో కోపంతో ప్రానాలను కూడా తీసుకుంటారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి..తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.


ఓ బాలుడు తండ్రి బిర్యాని తీసుకు రాలేదని ఉరి వేసుకోని ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన తో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం విషాధ చాయలు అలుముకున్నాయి.. వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన బాలాసోర్ జిల్లాలోని గోబింద్ పూర్ ప్రాంథానికి చెందిన మనోరంజన్ మహన్న ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడి కుమారుడు స్థానిక స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా, కొన్ని రోజులుగా ఆ బాలుడు బిర్యానీ తీసుకురమ్మని తన తండ్రిని కోరుతున్నాడు. అక్కడ పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచార పనుల్లో బాగా బిజీగా వున్నాడు. ఈ మేరకు బిర్యాని సంగతి పూర్తిగా మర్చిపోయాడు.


తండ్రి రోజూ ఖాళీ చేతులతో ఇంటికి రావడం చూసిన బాలుడు తీవ్ర నిరాశకు గురయ్యేవాడు. బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టం అని, రాత్రి అయిన నాకు బిర్యానిని తిసుకురా అని కోరాడు. అయితే ఆయన ఇంటికి రావడం ఆలస్యమైంది. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలుడు తన గదిలో పైకప్పుకి ఉరేసుకున్నాడు. అది చూసిన తల్లి దండ్రులు బాలుడు ను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బిర్యాని తీసుకు రాలేదని ఇంత పని చెస్తాడని అనుకొలెదని బొరున విలపించారు.ఇది స్థానికంగా కలకలం రేపుతోంది...


మరింత సమాచారం తెలుసుకోండి: