ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కోడికూర విషయంలో అన్న చెల్లెలి మధ్య తలెత్తిన గొడవ ఏకంగా ఒకరి ప్రాణం పోవడానికి దారి తీసింది. విచక్షణ కోల్పోయినా అన్న చివరికి సొంత చెల్లి ని దారుణంగా హతమార్చాడు. ఇక ఈ దారుణమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో వెలుగులోకి వచ్చింది. ఇలా కోడి కూర వండలేదు అని ఏకంగా సొంత చెల్లిని అన్న దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా అందరినీ భయాందోళనకు గురి చేసింది. కన్నా పురానికి చెందిన నందా అనే యువకుడు కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు.
ఇక ఇటీవలే నందను చూసేందుకు తెలంగాణలోని కరకగూడెం మండలం మదన గూడెం కు చెందిన చెల్లెలు సోమమ్మ అన్నయ్య ఇంటికి వచ్చింది. ఇక ఇంతలోనే రెండు రోజుల్లో వస్తాను అంటూ చెప్పి నందా భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇక ఇటీవలే నంద రాత్రి సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. వస్తు వస్తు కోడికూర తీసుకువచ్చాడు. కోడి కూర వండాలి అంటూ చెల్లెల్ని కోరాడు. అయితే తనకు ఆరోగ్యం బాగా లేదని కాస్త నీరసంగా ఉంది అంటూ చెప్పడంతో గొడవకు దిగాడు. ఇక ఆమె ఎంతకీ కోడికురా వండను అని చెప్పడంతో చివరికి ఇంట్లో ఉన్న గొడ్డలితో దారుణంగా నరికి వేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి