ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా స్నేహితుడు అంటే ఎలా ఉండాలి. ఎలాంటి ఆపద వచ్చినా కూడా నేను ఉన్నాను అంటూ భరోసా ఇవ్వాలి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి ఇక ఇలా స్నేహితులు ఉంటారు కాబట్టి స్నేహబంధం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం స్నేహితుడు అనే ముసుగులో నీచంగా ఆలోచించాడు ఏకంగా స్నేహితుడి భార్యపై కన్నీసాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జైపూర్లోని తిలక్ నగర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.
ఓ వ్యక్తికి కొన్నేళ్ళ క్రిందట ఇరవై ఏడేళ్ల మహిళ తో వివాహం జరిగింది. ఇక వీరి కాపురం కూడా ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఈ క్రమంలోనే అతని స్నేహితుడు విష్ణు రాయ్ స్నేహితుడి భార్య పై కన్నేశాడు. ఎలాగైనా లైంగిక వాంఛలు తీర్చుకోవాలి అని అనుకున్నాడు. స్నేహితుడు ఇంట్లో లేని సమయం చూసి ఇక అతని భార్యకు మత్తుపదార్థం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసాడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఇక ఆ దృశ్యాలను ఫోన్ లో రికార్డు చేసాడు. ఎవరికైనా చెబితే వీడియో సోషల్ మీడియాలో పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడి మరికొన్నిసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం భర్తకు తెలియడంతో అతని పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి