ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని మధురానుభూతి అందుకే ప్రేమించడం ప్రేమించబడడం వరం లాంటిది అని చెబుతూ ఉంటారు. ఇక రెండు మనసుల కలయిక ప్రేమ. ఎప్పుడూ ఏ క్షణం లో ప్రేమ పుడుతుంది అన్నది  కూడా ఎవరూ చెప్పలేని విధంగా ఉంటుంది. ఇక ప్రేమకు నిర్వచనం చెప్పమంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా చెబుతారు. కానీ నేటి రోజుల్లో ప్రేమకు అసలైన అర్థం మోసం అనే విధంగానే మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే నేటి రోజుల్లో ప్రేమ అనే తమ ఆయుధంగా మార్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటూ ఎంతో మంది యువతులను నట్టేట ముంచుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


మంచి వారిగా పరిచయం అవడం ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో మభ్య పెట్టడం.. ఇక చివరికి పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పి నట్టేట ముంచేయడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎంతో మంది. ఇటీవలే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. నువ్వు లేకుండా బ్రతకలేను నువ్వే జీవితం అంటూ ఎన్నో మాయమాటలతో ఆ యువతిని ప్రేమించేలా చేశాడు యువకుడు. ఇక ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారమే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక 45 రోజుల పాటు వీరి జీవితం ఎంతో సంతోషం గా సాగిపోయింది. ఇప్పుడు మాత్రం తనకు ప్రియురాలు వద్దు అంటూ ముఖం చాటేస్తూ ఉన్నాడు ఈ ఘటన వరంగల్లో వెలుగులోకి వచ్చింది.


 ప్రియుడిని నమ్మి సర్వం అర్పించిన సదరు యువతి ఇక ఇప్పుడు ప్రియుడు వద్దు అంటూ షాక్ ఇవ్వడంతో భర్త ఇంటిముందు చివరికి ఆందోళనకు దిగింది. పర్వతగిరి మండలం బట్టు తండాలో బాదావత్ అనిల్ కుమార్ ఇంటిముందు అతడి భార్య స్రవంతి ఆందోళన చేపట్టింది. చౌటపల్లి శివారు లచ్చ తండాకు చెందిన స్రవంతి తో ఇక ఈ ఏడాది జనవరిలోనే అనిల్ కు ప్రేమ వివాహం జరిగింది. ఇక 45 రోజుల పాటు సదరు యువతి తో కాపురం చేసిన అనిల్ కుమార్ ఇప్పుడు మాత్రం నాకు ప్రియురాలు వద్దు అంటూ తెగేసి చెబుతున్నాడు. దీంతో ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను అంటూ చెప్పి మాయ మాటలతో మోసం చేశాడని.. పెళ్లి చేసుకొని జీవితాన్ని నాశనం చేశాడని న్యాయం చేయాలంటూ యువతి భర్త ఇంటి ముందు ధర్నా చేయగా.. ఆమెకు గ్రామస్తులు కూడా మద్దతు పలుకుతూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: