కానీ ఇటీవలి కాలంలో ఏకంగా వావివరుసలు మరచి పోతున్న మనుషులు మానవ మృగాలుగా మారిపోయి దారుణంగా హత్యాచారాలు చేస్తున్నారు. ఏకంగా సొంత వాళ్ళ పై అత్యాచారం చేస్తూ ఉండడంతో ఆడపిల్ల రక్షణ అంతకంతకూ ప్రశ్నార్థకంగానే మారింది అని చెప్పాలి. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రి కన్నాకూతురు పై రోజులు అత్యాచారానికి పాల్పడుతూ ఉండడం సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.
మహారాష్ట్రలోని పుణెలో అమానుష ఘటన జరగడం గమనార్హం. బాలికపై ఆమె తండ్రి తమ్ముడు తాత మామ అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తుంది. పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలిక ఈ విషయం బయట పెట్టడంతో సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే బాలిక చెప్పిన నిజాలతో షాక్ అయిన పాఠశాల సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు... ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగాసంచలనం గా మారిపోయింది. ఈ ఘటన గురించి తెలిసిన తరువాత మిగిలిన ఆడపిల్లలు అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.. సభ్య సమాజంలో మనుషులు మరి ఇంత మానవమృగాలు గా మారిపోతున్నారా అని అందరూ షాక్ అవుతున్నారు.
ఇక సొంత వాళ్లే ఆడపిల్లలపై ఇలా అత్యాచారాలు చేస్తూ వేధింపులకు పాల్పడుతూ ఉంటే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది అని అందరు ప్రశ్నిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి