నేటి ఆధునిక సమాజంలో ప్రతి విషయంలో ఎంతో గొప్పగా ఆలోచిస్తున్న మనుషులు దాంపత్య బంధం విషయంలో మాత్రం ఎందుకో అలా ఆలోచించడం లేదు. ఎందుకంటే దాంపత్య బంధానికి విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలతో పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్న వారే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఏకంగా ఇక ఇలా పరాయి వ్యక్తుల మోజులో పడి కట్టుకున్న వారిని హతమార్చిన సంఘటనలు కూడా సభ్యసమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇక మరికొన్ని ఘటనలలో ఏకంగా కట్టుకున్న వారిని ఏమీ చేయలేక పిల్లలపై ఇక ప్రతీకారం తీర్చుకుంటున్న ఘటనలు కూడా అందరిని షాక్ అయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఓ బాలుడి హత్య కేసు కలకలం సృష్టించింది.


 తొలుత బాలుడు చెట్టుకు ఉరి వేసుకున్నట్లు గా కనిపించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు అని అందరూ భావించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా అసలు విషయాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లా కలిగిరి మండలం లోని అత్తవారి పల్లికి చెందిన రవి తులసి దంపతులకు కుమారుడు ఉదయ్కిరణ్ ఉన్నాడు. అయితే ఈనెల 11వ తేదీన కనిపించకుండా పోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ తర్వాత రోజే ఆద్దవారి పల్లి సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు బాలుడు.   ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు సవాలుగా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉండటంతో పక్క సాక్ష్యాధారాలను సేకరించడంలో ఎంతగానో కష్టపడి పోయారు పోలీసులు. ఎట్టకేలకు నిందితులను గుర్తించారు.



ఈ క్రమంలోనే హత్య చేసింది ఎవరో కాదు  బాబాయ్ అన్న విషయం ఇక పోలీసు విచారణలో తేలింది. బాలుడు చనిపోవడానికి ముందు రోజు సాయంత్రం ఇక బాబాయ్ సహదేవ్ సహా బంధువు రాజేశ్వరి తో కనిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఇక ఈ కేసును ఛేదించడం పోలీసులకు సులభంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక తమ అక్రమ సంబంధాలు ఎక్కడ బయట పెడతాయో అన్న భయంతో బాబాయ్ సమీప బంధువు రాజేశ్వరి బాలుడు మర్మాంగాలపై కొట్టి ఇక మెడకి టవల్ చుట్టి   చెట్టుకు ఉరి వేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: