ఇకపోతే ఇటీవల ఏకంగా ఒకేసారి వందల సంఖ్యలో కుక్కలు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇలా ఒక్కసారిగా కుక్కలు చనిపోవడానికి కారణం ఏంటి ఏదైనా కొత్త వైరస్ వచ్చిందా అని భయపడిపోయారు. కానీ ఆ తర్వాత మాత్రం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూగజీవాల పట్ల ఒక సర్పంచ్ చేసిన పని ఇలా వందల సంఖ్యలో కుక్కల మరణానికి కారణం అనేది తెలుస్తుంది. విషం ఇంజక్షన్లు ఇవ్వడంతోనే మూగజీవాల అయినా కుక్కలు మృతి చెందినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామంలో వెలుగులోకి వస్తుంది ఈ ఘటన.
ఇటీవలే ఒక వ్యక్తి తన పెంపుడు కుక్క చనిపోవడంతో హైదరాబాద్ లోని యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు తెలిపాడు. ఈ క్రమంలోనే సంస్థ సభ్యులు ఇటీవలే గ్రామానికి వచ్చి విచారించారు. అయితే ఇటీవలే కుక్కల బెడద పై గ్రామస్తులు పలుమార్లు పంచాయితీకి ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ భాను ప్రకాష్ రావు చెబుతున్నారు. అయితే పంచాయతీ కార్యదర్శి తో కలిసి తాను కుక్కలకు విషపు ఇంజక్షన్ చెప్పినట్లు తెలిపారు. ఈ విషం వల్ల వందకు పైగా శునకాలు చనిపోయాయని వాటి కళేబరములను గ్రామ పరిసరాల్లో పూడ్చి వేసినట్లు తెలిపారు. ఈ విషయంపై సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి