అయితే ఇలా వంతెన చోరీ కేసులో ఆర్జేడీ నేత కూడా ఉన్నారు అన్న వార్త బయటకు వచ్చి సంచలనం మారిపోయింది. అంతే కాదు నిందితుల దగ్గర్నుంచి గ్యాస్ కట్టర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీటిపారుదల శాఖలో చేస్తున్న ఉద్యోగి అరవింద్ కుమార్ ఆర్జేడీ నేత శివకళ్యాణం భరద్వాజ్, చందన్కుమార్, సచ్చిదానంద సింగ్, మనీష్ కుమార్ గోపాల్ కుమారులను అరెస్టు చేశారు పోలీసులు. నీటిపారుదల శాఖ ఉద్యోగి అరవింద్ వాహనంలో వంతెన సామాగ్రిని ఒక చోట నుండి మరొక చోటికి తరలించినట్లు పోలీసులు విచారణలో తేలింది అంటూ చెప్పుకొచ్చారు.
రోహ్‌తాస్ జిల్లాలో 60 అడుగుల పాడుబడిన వంతెనను పట్టపగలు దొంగలించడం సంచలనంగా మారింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులం అంటూ చెబుతూ గ్యాస్ కట్టర్లు, ఎర్త్ మూవర్ మిషన్లతో వంతెనను కూల్చివేసి చోరీ చేసినట్లు వార్తలు వచ్చాయి. కొందరు జేసీబీ, గ్యాస్ కట్టర్ వంటి యంత్రాలతో వంతెనను ఫోన్ కూల్చేశారు అన్న సమాచారాన్ని గ్రామస్తులు అందించినట్లు నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజనీర్ అర్షద్ కమల్ షంషీ తెలిపారు. తాము ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని షంషీ చెప్పుకొచ్చారు. 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున్న వంతెన ఒక్కసారిగా మాయమైపోవడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. 1972లో అమియావర్‌లోని ఆరా కాలువపై ఈ వంతెనను నిర్మించడం గమనార్హం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి