ఇలా ఏ క్షణంలో ఎప్పుడు కరోనా వైరస్ దాడి చేసి ప్రాణాలు తీస్తుందో అన్నది తెలియని పరిస్థితుల్లో అటు మనుషులు మాత్రం నిర్లక్ష్య ధోరణి తో తమ ప్రాణాలు పోవడానికి వారే కారకులు గా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా పోతున్న ప్రాణాల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది. అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వెరసి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా కొంతమంది నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోతుంటే మరికొంతమంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది అనేది తెలిస్తుంది.తెలంగాణలో నిజాంబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి అన్నది తెలుస్తుంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది అని తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి