స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలకు సైతం చేసిన ఎంతోమంది మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి వజ్రోత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకం ఎగరాలి అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరు కూడా పాటించారు.. దీంతో దేశంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది అనే చెప్పాలి.


 ఇక పాఠశాలలు కళాశాలల విద్యార్థులు కూడా ఎంతో ఘనంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు అనే చెప్పాలి. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం ఏకంగా ఆగస్టు 15వ రోజునే జాతీయ జెండాకు అవమానం జరగడం గమనార్హం. ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాంటిదే జరిగింది. సంగారెడ్డి జిల్లా శాంతినగర్ లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పాఠశాల డైరెక్టర్ త్రివర్ణ పతాకాన్ని అవమానించారు.


 అయితే జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు గాను కింద గద్దె ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఏర్పాటు చేసిన గద్దె పై త్రివర్ణ పతాకం పై ఉండే కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులను వేశారు. అయితే జెండా ఎగురవేసే టప్పుడు చెప్పులను వదిలేయకుండా ఏకంగా షూ వేసుకుని ఇక ఆ గద్దెపైకి ఎక్కి జాతీయపతాకాన్ని అవమానించారు పాఠశాల డైరెక్టర్ బాలిరెడ్డి. అయితే జండా వందనానికి వచ్చిన విద్యార్థులు టీచర్లు సిబ్బంది కూడా అక్కడ జరిగింది చూసి చలించి పోయారు అని చెప్పాలి. అయితే అలా చేయడం చట్టరీత్యా నేరమని జాతీయ జెండాను అవమానించినట్లే అని తెలిసినప్పటికీ కూడా డైరెక్టర్ బాల్రెడ్డి ఇలా చేయడం ఏంటి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: