భారత్లో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి. ప్రస్తుతం భారత జాతీయ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తూ స్టార్ క్రికెటర్లుగా ఎదిగిన వారిని అటు ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు ఆరాధ్య దైవంగా పూజించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. సినిమా హీరోలు కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే క్రికెటర్లకు ఫాలోవర్లు కూడా ఉంటారు. ఇకపోతే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇకపోతే రోహిత్, విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీమిండియాలో అత్యుత్తమ క్రికెటర్లుగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కోహ్లీ మాజీ కెప్టెన్ గా కొనసాగుతుండగా రోహిత్ శర్మ ప్రస్తుత కెప్టెన్ గా ప్రస్థానాన్ని  కొనసాగిస్తున్నాడు. ఇక వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ ఇక వీరిద్దరూ స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండటంతో.. వీరిపై వచ్చిన వార్తలు అవాస్తవం అని అందరూ భావించారు. అయితే హీరోలు స్నేహంగా ఉన్నప్పటికీ వారి అభిమానుల మధ్య వారు జరిగినట్లుగానే ఇక క్రికెటర్లు స్నేహభావంతో మెలిగినప్పటికీ వారి ఫాన్స్ మధ్య అప్పుడప్పుడు వారు జరుగుతూ ఉంటుంది.


 ఇక్కడ టీం ఇండియా సీనియర్ క్రికెటర్లు అయినా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అభిమాని.. ఇతర క్రికెటర్ల అభిమాని  మధ్య జరిగిన వార్ కాస్త చివరికి ఒక ప్రాణం పోవడానికి కారణమైంది అని చెప్పాలి.  తమ అభిమాన క్రికెటర్లు అయినా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలను దూషించాడని ఒక వ్యక్తి ఏకంగా స్నేహితుడనే కొడవలితో దారుణంగా నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని ఆరియా లూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అయితే ఇద్దరు స్నేహితులు మద్యం సేవిస్తుండగా క్రికెట్ గురించి చర్చ వచ్చింది. ఇక మృతుడు కోహ్లీ, రోహిత్ లను బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మరో స్నేహితుడు దారుణంగా గొడవలతో నరికేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: