
ప్రేమ అనే మాయ లో పడి పోతున్న ఎంతో మంది యువతీ యువకులు చివరికి సొంత వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని పరిస్థితి ఏర్పడింది. అదే సమయం లో కొంత మంది ఇక ప్రేమించి తమ ప్రేమను గెలిపించు కోలేకపోయాము అనే కారణం తో చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే పరువు హత్యలకు గురవుతున్నారు. ఇలా ఏదో ఒక విధంగా ప్రేమ అనేది ఏకంగా ప్రాణాలు తీసేస్తుంది అని చెప్పాలి.
ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి మోజులో పడిపోయిన ఒక కొడుకు తండ్రిని దారుణంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు.. ఈ క్రమంలోనే తండ్రిని కొడుతూ ఇక ప్రియురాలికి వీడియో కాల్ చేసి రాక్షసానందాన్ని పొందాడు కొడుకు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హోంగార్డుగా పనిచేస్తున్న ఢిల్లీ బాబు కొడుకు భరత్.. 39 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తండ్రి కొడుకుకి పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన భరత్ ఏకంగా తండ్రి పై దాడి చేశాడు. ఈ ఘటనలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.