ఇక్రమ్ అబ్దుల్ సలాం, జన్నత్ కు ఈ నెల 9వ తేదీన వివాహం జరిగింది. ఇక వధూవరుల కుటుంబ సభ్యులు మరియు బంధువులందరి మధ్య ఈ వివాహం జరిగింది. ఆచారాల ప్రకారం ఇక్రమ్, భార్య జన్నత్ మరుసటి రోజు శోభనం జరిగింది. ఉదయం తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది జన్నాత్. పెళ్లి తర్వాత శోభనం గదిలో అలసిపోయి పడుకున్నాడు పెళ్ళికొడుకు. అయితే సరిగ్గా మధ్యాహ్నం సమయంలో గదిలో నుంచి ఇక్రమ్ కేకలు వినిపించడంతో అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లారు ఈ సమయంలో అక్కడ రక్తపు మరకలు పడి ఉన్నాయి.. ఏకంగా మెడ చేతికి రక్తం కారుతు కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సీలింగ్ ఫ్యాన్ ఊడి కింద పడటం కారణంగానే తీవ్ర గాయాలు అయ్యాయి అన్న విషయాన్ని గుర్తించి వెంటనే ఇక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించి చివరికి అతని ప్రాణాలను కాపాడారు. అయితే శోభనం గదిలో సీలింగ్ ఫ్యాన్ పాతది కావడం వల్ల ఇక ఈ ఘటన జరిగి ఉంటుందని.. క్రమ్ తండ్రి షేక్ రంజాన్ తెలిపారు. ఇక ప్రమాదం నుంచి చిన్న గాయాలతో ఇక్రమ్ బయటపడటం సంతోషించదగ్గ విషయమని.. ఇక కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ ఘటనలో ఏకంగా ఇక్రమ్ మెడకు రెండువైపులా రక్తనాళాలు కట్ కావడంతో 26 కోట్లు వేసి బిగించినట్టు డాక్టర్లు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి