ప్రతి మనిషి జీవితంలో ఎన్ని రక్త సంబంధాలు ఉన్నా అటు స్నేహబంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు . అయితే  స్నేహబంధం ఎంత గొప్పది అని తెలిపే విధంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించాయి. అంతేకాదు ఇక రక్త సంబంధీకులతో పంచుకోలేని విషయాలను కూడా స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కులం మతం అనే భేదం లేకుండా రక్తసంబంధం లేకపోయినా స్నేహబంధం ఎంతో బలంగా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.


 ఈ స్నేహానికి గుర్తుగా ప్రత్యేకంగా ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. అయితే నేటి రోజుల్లో మాత్రం ఫ్రెండ్షిప్ గురించి ఇలాంటివి మాటల్లో తప్ప చేతల్లో మాత్రం కనిపించడం లేదు. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన నేటి సభ్య సమాజంలో స్వార్థం కోసం ఆలోచించే వారే తప్ప స్నేహానికి గౌరవం ఇచ్చేవారు ఎక్కడ కనిపించడం లేదు. స్నేహం చేస్తున్నట్లు నటించి చివరికి సొంత లాభాలు చూసుకుంటున్నారు. ఇక చిన్న చిన్న కారణాలతో స్నేహానికి పులిస్టాప్ పెట్టే వాళ్ళు కొంతమంది అయితే.. దెబ్బలు ఆడుకునే వారు ఇంకొంతమంది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత దారుణమైనది అని చెప్పాలి.



 ఈ ఘటన ఏపీలోని మదనపల్లెలో చోటుచేసుకుంది. సాధారణంగా స్నేహితులు పుట్టినరోజు పార్టీకి అందరిని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక కుర్రాడిని తన స్నేహితులు పుట్టినరోజు పార్టీ ఉందని పిలిపించారు. ఇక ఎంతో హుషారుగా కుర్రాడు అక్కడికి వెళ్ళగా.. అతనిపై తన మిత్రులు దారుణంగా దాడికి దిగారు. ఫ్రెండ్ అని మరిచిపోయి విచక్షణ రహితంగా చితకబాదారు. కాళ్ళ వేళ్ళ పడ్డ కూడా కనికరించలేదు. మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దు అని చెప్పినందుకు.. ఇలా ఆ కుర్రాడిపై స్నేహితులందరూ కలిసి దాడి చేశారట. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: