పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఒక మధురానుభూతి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే తమకు నచ్చిన భాగస్వామినీ జీవితం లోకి ఆహ్వానించి జీవితాన్ని ఎంతో సంతోషం గా గడపాలని అందరూ ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమం లోనే పెళ్లి తంతును బంధుమిత్రులందరికీ సమక్షంలో నిర్వహిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా దాంపత్య బంధం లోకి అడుగు పెట్టిన భార్యా భర్తలు ఇద్దరు కూడా సంవత్సరం తిరిగేలోపే ఇక పండంటి మగ బిడ్డకు తల్లిదండ్రులుగా మారాలి అని ఆశ పడుతూ ఉంటారు.


 అయితే ఇక అటు వధూవరులు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఇక సంవత్సరంలోపు ఒక పిల్లాడిని మా చేతిలో పెట్టి ఆడించాలి అంటూ ఒక వధూవరులతో చిలిపిగా మాట్లాడటం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా పెళ్లయిన నూతన వధూవరులు  ఇక సంవత్సరంలోపు ఒక బిడ్డకు జన్మనివ్వడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ పెళ్లయిన రెండో రోజే ఏకంగా వధువు బిడ్డకు జన్మనివ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా ఇది వినడానికి ఎంతో షాకింగ్ గా ఉంది కదా. కానీ ఇక్కడ ఇలాంటి తరహా ఘటన నిజంగానే వెలుగులోకి వచ్చింది.


 పెళ్లయిన రెండు రోజులకే కొత్త పెళ్లికూతురు బిడ్డకు జన్మనిచ్చిన షాకింగ్ ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నోయిడాలో ఈ ఘటన జరిగింది. స్థానిక యువకుడికి సికింద్రాబాద్ కు చెందిన అమ్మాయితో ఈ నెల 26వ తేదీన వివాహం జరిగింది. అయితే మరునాడు ఆమె కడుపునొప్పి ఉందని చెప్పడంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆమె ఏడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో వరుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఇక ఆ మరుసటి రోజు నెలలు నిండక ముందే కొత్తపెళ్లికూతురు బిడ్డకు జన్మనిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: