ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్కూలుకు
వెళ్లే ఒక చిన్నారిపై అటెండర్ కన్నేసి దారుణానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయం చూసి అదునుగా
తీసుకొని ఆ బాలికపై లైంగిక దాడి చేశాడు. ఆ విషయాన్ని ఎవరితో అయినా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఒకవైపు విశాఖ పోలీసులు ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు బాలికను పాడుచేయాలని చూసిన ఆ అటెండర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు నిరసనకు దిగాయి. దాంతో విశాఖపట్నం మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విశాఖ ఎయిర్‌పోర్ట్ పీఎస్ పరిధిలో ఒక నేవీ ఉద్యోగి కూతురు ఎనిమిదవ తరగతి చదువుతుంది. సత్యరావు అనే వ్యక్తి అదే స్కూల్లో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా ఆ బాలికపై లైంగిక దాడి చేస్తూ ఎవరికీ చెప్పొద్దు అని బెదిరించడంతో, బాలిక బయపడి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి,  ఏమైందని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.

తన కూతురి పై ఆ కామాంధుడి చేసిన లైంగిక దాడి గురించి తెలిసి ఆ తల్లి తల్లడిల్లి పోయింది. ఆ అటెండర్ పై కేసు నమోదు చేయడం తో అతని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దిశ పిఎస్ కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం కేజీహెచ్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆ కామాంధున్ని అరెస్ట్ చేసి కోర్ట్ ఆదేశాలతో రిమాండ్ కి తరలించినట్లు దిశ ఏసీబీ
వివేకానంద తెలిపారు. సత్యరావు ఫోన్ ని సీజ్ చేసి ల్యాబ్ కి పంపించారని కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారా అనేదానిగురించి కూడా బాలిక కోలుకున్న తరువాత పూర్తి వివరాలు సేకరిస్తాం అని వివేకానంద తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: