కొంతమంది బిజినెస్ ను పెంచుకోవడానికి టమాటా పేరుతో ఆఫర్లు ప్రకటిస్తుంటే.. ఇంకొంతమంది ఏకంగా టమాటా ఎంత కాస్లీ గా మారిందో చెబుతూ ఎన్నో రీల్స్ చేస్తున్నారు. దీంతో ఇలాంటివి వైరల్ గా మారిపోయి పాపులారిటీ కూడా పెరిగిపోతుంది. ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ అయితే ఏకంగా వినుతమైన ఆఫర్ ప్రకటించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఏకంగా తన ఆటోలో ఎక్కిన వారికి కిలో టమోటాలు ఉచితంగా ఇస్తాను అంటూ ఆఫర్ పెట్టాడు వ్యక్తి. ఆటో డ్రైవర్ ఏంటి టమాటాలు ఫ్రీగా ఇస్తాను అని ఆఫర్ పెట్టడం ఏంటి.. అతనికొచ్చేదే అంతంత మాత్రం అని అనుకుంటున్నారు కదా.
అయితే ఇక్కడే ఒక చిన్న కండిషన్ పెట్టాడు ఆటో డ్రైవర్. తన ఆటోలో ఒక్కసారి కాదు ఏకంగా ఐదు సార్లు ప్రయాణించిన వారికి కిలో టమాట ఉచితంగా ఇస్తాను అంటూ ఆఫర్ ప్రకటించాడు. పంజాబ్ లోని చండీగఢ్ లో ఆటో డ్రైవర్ ఇలా వినూత్న ఆలోచన చేశాడు. తన ఆటోలో ఐదు సార్లు ప్రయాణించిన వారికి కిలో టమాటాలు ఇస్తానని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆటో వెనకాల అతికించాడు అని చెప్పాలి. దీంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూశాక ట్రెండింగ్ లో ఉన్న టమాటాను ఎవరు తోచిన విధంగా వారు వాడేసుకుంటున్నారు అన్నది మాత్రం అర్థం అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి