ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా రాపిడో బైక్ ని బుక్ చేసుకుంది యువతి. అయితే ఇలా బైక్ పై యువతిని తీసుకువెళుతున్న సమయంలో క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. ఆమె ముందే హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఇక గమ్యస్థానంలో దించిన తర్వాత తనను వేధించాడు అంటూ ఇటీవలే ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇటీవల ఆమె బైక్ పై వెళ్లేందుకు బైక్ బుక్ చేసుకోగా.. డ్రైవర్ వేరొక బైక్ పై వచ్చాడు.
యాప్ లో రిజిస్టర్ అయిన బైక్ సర్వీసింగ్ లో ఉందని డ్రైవర్ చెప్పడంతో.. నా బుకింగ్ ధృవీకరించడంతో అక్కడినుంచి రైడ్ కొనసాగించినట్లు మహిళ తెలిపింది. అయితే చుట్టూ వాహనాల లేని ఏకాంత ప్రాంతంలో డ్రైవర్ బైక్ నడుపుతూ హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు. నేను భయపడి మౌనంగా ఉన్నాను. లొకేషన్ తెలియాకుండా ఉండడానికి గమ్య స్థానానికి 200 మీటర్ల ముందే దిగిపోయానని సదరు మహిళలు చెప్పుకొచ్చింది. తర్వాత క్యాబ్ డ్రైవర్ వాట్సాప్ లో మెసేజ్లు కాల్స్ చేయడం మొదలు పెట్టాడు అంటూ తెలిపింది.
ఈ క్రమంలోనే అతను చేసిన మెసేజ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించింది. అయితే ఇలా రాపిడో బైకర్ దారుణంగా ప్రవర్తించాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాపిడో భద్రతా చర్యలను మరింత ప్రశ్నించింది సదరు బాధితురాలు. సదరు వ్యక్తి తనకు అనేక నెంబర్ల నుంచి కాల్ చేసి వేధిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితేఇటీవల సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదుఅనుభవం గురించి.. పూర్తి వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ రూపంలో పెట్టింది సదరు మహిళ. అయితే ఇటీవల బెంగళూరు పోలీసులు ఈ విషయాన్ని గమనించి ఇక రాబిడో బైక్ డ్రైవర్ ని అరెస్టు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి