ఒకప్పుడు ఎక్కువగా గడ్డం పెంచుకొని కనిపించారు అంటే చాలు.. చూడు.. వాడు ఎలా ఉన్నాడో.. కనీసం గడ్డం కూడా చేసుకోకుండా జులాయిగా మారిపోతున్నాడు అని తిట్టుకునేవారు అందరూ  కానీ ఇటీవల కాలంలో మాత్రం అదే గడ్డం పెంచుకోవడం ట్రెండ్గా మారిపోయింది. ఇక ఎంతోమంది యువత తమకు నచ్చిన షేపులో గడ్డం చేసుకొని స్టైలిష్ గా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా గడ్డం ఎక్కువగా ఉన్న వాళ్ళని ఇష్టపడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే ఇటీవల కాలంలో పెళ్లి సమయంలో కూడా ఇలా గడ్డం పెంచుకునే వివాహం చేసుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా గడ్డం పెంచుకోవడమే ఇక్కడ ఒక యువకుడు పాలిట శాపం గా మారింది. ఏకంగా అతని తండ్రి పెళ్లి విషయంలో విలన్ అవతారం ఎత్తాడు. గడ్డం షేవ్ చేసుకోమంటే కొడుకు వినలేదని చివరికి పెళ్లినే క్యాన్సల్ చేసాడు. కాగా కోయంబత్తూరు నగరంలో వెలుగు చూసింది ఈ ఘటన. సూళ్లూరు కు చెందిన వ్యాపారవేత తన కుమారుడికి వివాహం ఏర్పాటు చేశారు. పొల్లాచి ప్రాంతానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరగగా.. 3 నెలలుగా పెళ్లి ఏర్పాట్లు నిమగ్నమయ్యారు అందరూ.



 అయితే నిత్యం గడ్డం పెంచుకునే వాడు వరుడు కానీ పెళ్లి సమయానికి క్లీన్ షేప్ చేసుకోవాలని తండ్రి సూచించాడు. అయితే తండ్రి చెప్పినట్లుగానే క్లీన్ షేవ్ చేసుకునేందుకు వెళ్ళాడు వరుడు. కానీ గడ్డం పూర్తిగా క్లీన్ షేవ్ చేసుకోకుండా కాస్త ట్రిమ్ చేసుకో అని చెప్పింది వధువు. ఇక కాబోయే భార్య చెప్పినాక వినకుండా ఉంటాడా..  గడ్డాన్ని ట్రిమ్ చేసుకుని పెళ్లి మండపానికి  వచ్చాడు. అయితే తన మాట బేకాతరూ చేసి వధువు చెప్పిన మాట విన్నాడు అని తెలిసి  అతని తండ్రికి చిర్రేత్తుకొచ్చింది. ఇప్పుడే నాకు గౌరవం ఇవ్వడం మానేసావు.. ఇంకా పెళ్లయ్యాక ఇంకేం ఇస్తావ్  అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. గడ్డం తీస్తేనే పెళ్లి అని తేల్చి చెప్పాడు. తర్వాత వధువు కుటుంబ సభ్యులు వచ్చి బ్రతిమిలాడిన    చివరికి పెళ్లి ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: