ఇద్దరికి ముందే పెళ్లయింది. ఆ తర్వాత విడాకులు అయ్యాయి. అయితే వారికది రెండో సంబంధం. అప్పటికే ఆమెకు ఒక కూతురు ఉంది. అయితే ఇద్దరు ఇష్టపడి రెండో పెళ్లి చేసుకున్నారు. లండన్ లో కాపురం పెట్టారు. ఇద్దరు సాప్ట్ వేర్ జాబ్ చేస్తుంటారు. అయితే ఉన్నట్లుండి వారి మధ్యలో విభేధాలు రావడంలో భార్య శిరిష ఇండియాలోని హైదరాబాద్ కు వచ్చింది.


అయితే భర్త అజిత్ కుమార్ మాత్రం లండన్ లోనే ఉండిపోయారు. అయితే ఈ విబేధాలతో కక్ష పెంచుకున్న భర్త మాత్రం వారిని తెలివిగా చంపాలని నిర్ణయించుకున్నారు. దీనికి శిరిష ఉండే అపార్ట్ మెంట్ లోని తన స్నేహితుడు పూర్ణ చందర్ రావు, వాచ్ మెన్ కొడుకు ను ఉపయోగించి లండన్ నుంచి ఆర్సెనిక్ అనే విష పదార్థాన్ని పంపించాడు. దీన్ని ఇక్కడ ఉండే పూర్ణ చందర్ రావు, వాచ్ మెన్ కొడుకు శిరీష ఇంట్లో జరిగిన చిన్న పంక్షన్ లో వారు తినే ఆహార పదార్థాలలో కలిపారు.


దీంతో శిరీష తల్లిదండ్రులు, అన్న దమ్ములు ఇద్దరు మిగతా వారికి తీవ్ర ఫుడ్ ఎలర్జీ అయింది. ముందుగా విషయం తెలిసిన శిరీష బంధువులు మాత్రం ఫుడ్ ఎలర్జీ అనుకుని ఆసుపత్రికి వెళ్లారు. అయితే తర్వాత వారి కాళ్లు చేతులు కూడా చచ్చుబడిపోయాయి. ఉన్నట్లుండి కుటుంబం మొత్తం ఇలా కావడంతో అంతుపట్టలేదు. శిరీష తనకు తెలిసిన డాక్టర్ కు ఆమె కూతరును  విజయవాడలో చూపించడంతో ఆమె తిన్న ఆహారంలో విషం కలిసిందని చెప్పారు.


దీంతో శిరీషకు లండన్ లో ఉన్న భర్త అజిత్ రావుపై అనుమానం వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా.. అజిత్ రావు ఆర్సెనిక్ అనే విషాన్ని పంపడం, ఇక్కడ దాన్ని ఆ కుటుంబం తినే దాంట్లో ఇక్కడ ఆరుగురు సహాయపడ్డట్లు తేలింది. దీంతో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అజిత్ ను కూడా అరెస్టు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: