మన సమాజంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప కొంచెం కూడా తగ్గటం లేదు.ఇలాంటి దారుణమైన ఘటనలు కేవలం కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. అసలు బాగా చదువుకున్న వారు కూడా ఇలా చేయటం నిజంగా సమాజానికి చాలా సిగ్గు చేటనే చెప్పాలి. అలాంటి దారుణమైన ఘటనే మన హైదరాబాద్ మహా నగరంలో జరిగింది. ఇక విషయానికి వస్తే.. ఓ ప్రైవేట్ స్కూల్ ఛైర్మెన్ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి లైంగిక దాడి చేసాడు. ఇక ఆ విషయం అతడి కుమారుడికి చెప్తే అది తప్పు అని చెప్పకుండా తిరిగి ఆ యువతినే కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ స్కూలు యజమానిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.


ఇంటి పని చేసేందుకు ఓ యువతీ ఏ గ్రేట్ ఏజెన్సీ అనే కంపెనీలో  చేరింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీకుంద్ ఇంకా అతని కొడుకు ఆకాష్ నివాసం ఉంటున్న ఇంట్లో పని చేయాలనీ ఏజెన్సీ ఆమెకు ఆర్డర్ వేసింది. అక్కడికి వెళ్లి ఆమె బుద్దిగా తన పని చేసుకొని అక్కడి నుండి వెళ్ళేది. అయితే ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం పని చేయటానికి వచ్చిన ఆ యువతిని పిలిచి తన బెడ్ రూమ్ లో బెడ్ షీట్ సరి చేయాలనీ ఆమెని ఆదేశించాడు. అతని ఆదేశం మేరకు ఆ యువతీ బెడ్ రూమ్ లో బెడ్ షీట్ మారుస్తుండగా వెనకాలే వెళ్లి రూమ్ డోర్ లాక్ చేసి స్నానం చేసి రావాలని యువతీని ఆ దుర్మార్గుడు బెదిరించాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆ పేద యువతి అతను చెప్పిన విధంగా చేసింది. బాత్రూమ్ లో ఆమె స్నానం చేస్తుంటే ఫోటోలు, వీడియోలు తీశానని బెదిరించి కనికరం లేకుండా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ కామాంధుడు.


అంతేకాకుండా ఈ విషయం ఎవరికైన చెప్తే ఆమెని ఆమె తల్లిని చంపేస్తానని బెదిరించాడు. పాపం భయపడిన ఆ యువతి అతడి కుమారుడికి తెలుపగా ఆ దుర్మార్గుడు కూడా విషయం ఎవరికి చెప్పొద్దని ఆమెను కొట్టి బెదిరించాడు. తరువాత కూడా ఆ యువతిపై అతడు పలు మార్లు అత్యాచారం చేయగా వేధింపులు తట్టుకోలేక ఆ యువతీ వారి ఇంట్లో కొడుతున్నారని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఇక పోలీసులు కూడా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపించేశారు. ఇటీవలే తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ఆ అమ్మాయి తన తల్లికి తెలుపగా.. ఇద్దరు కలిసి పోలీసు స్టేషన్ లో ఈ నెల 18న ఆ నీచపు తండ్రి కొడుకలపై కేసులు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించగా.. మురళీకుంద్ ఇంకా అతడి కుమారుడు ఆకాష్ పై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: