ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు ప్రతిచోట ఇక నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఇలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఈ ప్రమాదాలతో ఎంతోమంది అభం శుభం తెలియని అమాయకులు కూడా బలవుతున్నారు. ఒకరు చేసిన పొరపాటుకి ఇంకొకరు శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి. అయితే రోడ్డు ప్రమాదాల బారినపడి కొంతమంది కాళ్లు చేతులు కోల్పోయి జీవచ్ఛవాలుగా మారిపోతుంటే.. ఇంకొంతమంది చివరికి ప్రాణాలను కోల్పోతున్నారు.


 అందుకే రోడ్డుపై వాహనాలను నడిపేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారు. అయినప్పటికీ వాహనదారుల తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు అని చెప్పాలి. అయితే కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇలా ప్రమాదాలకు కారణం అవుతుంటే.. ఇంకొంతమంది రద్దీగా ఉన్న రోడ్లపై బైక్, కార్ లాంటి వాహనాలను నేర్చుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అయితే ఇలా ఎవరైనా వాహనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ట్రైనర్ ఇచ్చే సూచనలను తూచా తప్పకుండా పాటించాలి.


 అలా పాటించలేదంటే ఎంతటి ప్రమాదం జరుగుతుందో అనేదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో ఒక మహిళ తన భర్త వద్ద బైక్ నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే అతను చెప్పినట్టు జాగ్రత్తగా బైక్ ఎక్కిన ఆమె ఆ తర్వాత మొదటి గేర్ లో బండిని మెల్లగా ముందుకు పోనిచ్చింది. తర్వాత యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించింది. అక్కడే అనుకోని ప్రమాదం జరిగింది. ఆమె యూటర్న్ తీసుకునే క్రమంలో ఎదురుగా ఒక బైక్ వచ్చింది. అయితే ఈ విషయాన్ని మహిళ గమనించినప్పటికీ కంగారులో బ్రేక్ వేయలేకపోయింది. అయితే బ్రేక్ వేయమని భర్త ఎంత అరిచి చెప్పిన అలా చేయలేదు. దీంతో వేగంగా దూసుకు వచ్చిన బైక్ ఆమెను ఢీ కొట్టింది  ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: