నేటి సభ్య సమాజంలో మనీకి ఉన్న వాల్యూ అటు మనుషులకు లేకుండా పోయింది. ఏకంగా మనిషి తయారు చేసిన మనీ ఆరడుగుల మనిషిని ఆడిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆస్తులు అంతస్తులు పేరుతో ఎంతోమంది దారుణాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. మానవ బంధాలకు విలువ ఇవ్వకుండా మనీ మాయలో పడిపోతున్న వారు చివరికి ఎంతటి దారుణానికి పాల్పడేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. రక్తసంబంధాలను పేగు బంధాలను కూడా మరిచిపోయి రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకంగా ఆస్తుల కోసం సొంత అన్నదమ్ములనే హత్య చేసేందుకు వెనకడుగు వేయట్లేదు కొంతమంది. అయితే ఏకంగా తల్లిదండ్రులు చనిపోతే ఆస్తి తమకే దక్కుతుంది అని అత్యాశకు పోయి ఇక కనిపించిన తల్లిదండ్రుల విషయంలో కనీసం కాస్తయినా  జాలి దయ చూపించకుండా ప్రాణాలను గాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇక అయితే ఇటీవల మెదక్ జిల్లాలో ఇలాంటి దారుణ  ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కనీ పెంచిన తల్లిదండ్రులని కొడుకు, కూతురు కలిసి ఆస్తి కోసం దారుణంగా చంపేశారు. చేగుంట మండలం అనంతసాగర్ లో ఈ దారుణం జరిగింది. 18 నెలల క్రితం హత్యకు గురైన కిష్టయ్య కేసులో ఇటీవల నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆస్తికోసం కిష్టయ్యను అతని పెద్ద కుమారుడు స్వామి పెద్ద కూతురు రేణుక అల్లుడు అశోక్ తో కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. అయితే కూతురు కుమారుడిని అరెస్టు చేసిన పోలీసులు చివరికి వారిని రిమాండ్ కు తరలించారు. కాగా అల్లుడు అశోక్ ఇటీవలే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అన్న విషయాన్ని పోలీసులు తెలిపారు. అయితే ఏకంగా సొంత బిడ్డలే ఇలా కిష్టయ్యను చంపారు అన్న విషయం తెలిసి స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: