ఈ ప్రపంచంలో పిల్లలను అందరికంటే ఎక్కువగా ప్రేమించేది కేవలం తల్లి మాత్రమే అని చెబుతూ ఉంటారు. అయితే ఇక బయటకు చూపించక పోయినా తల్లి లాగానే ప్రేమిస్తూ ఉంటాడు తండ్రి. పైనకి కాస్త గంభీరంగా కనిపించినా.. లోలోపల మాత్రం పిల్లలపై అమితమైన ప్రేమను కలిగి ఉంటాడు. పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు  లోకం తీరును అర్థం అయ్యేలా చేస్తూ.. ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి.. ఇక పిల్లలలో ధైర్యం నింపుతూ ఉంటాడు. ఇలా తండ్రి గురించి చెప్పుకుంటూ పోతే ఎంత వర్ణించినా తక్కువే. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలను అనుక్షణం కాచుకుంటూ ప్రతి సమస్యలో నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే సూపర్ హీరో తండ్రి అని చెప్పాలి. కానీ అలాంటి తండ్రి ఇక్కడ ఒక కొడుకు పాలీట యమకింకరుడుగా మారిపోయాడు. ఏకంగా పదేళ్ల కొడుకుని కనీసం జాలి దయ లేకుండా దారుణంగా చంపేశాడు. రాజస్థాన్లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బికనీర్ జిల్లాలో చోటుచేసుకుంది. జితేంద్ర ఓజు అనే 48 ఏళ్ల వ్యక్తి తన పదేళ్ల కొడుకుని నీటి కుంటలో తోసి చంపేశాడు. అనంతరం అతను కూడా అదే కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికులు అందరినీ కూడా ఉలిక్కిపడేలా చేసింది.


 అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే జితేంద్ర ఓజు ఎందుకు ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అనే విషయంపై విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే జితేంద్ర తన పదేళ్ల కొడుకుని నీటి కుంటలోకి తోసీన వెంటనే ఆ బాలుడు పలుమార్లు బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశాడని.. కానీ జితేంద్ర మాత్రం మళ్లీ మళ్లీ కొడుకుని నీటిలోకి తోసేసాడు అని స్థానికులు చూసినట్లు చెప్పారు అంటూ పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: