నేటి టెక్నాలజీ యుగంలో మనిషి ఆలోచన తీరులో పూర్తిగా మార్పు వచ్చేసింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన జీవనశైలిని కూడా మార్చుకోవడానికి తెగ ఇష్టపడుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో తినే ఆహారం దగ్గర నుంచి వాడే వస్తువుల వరకు అన్నింటిలో కూడా మార్పు చేసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా టెక్నాలజీకి తగ్గట్లుగా మనిషి అలవాట్లు మారడం మంచిదే. కానీ ఎందుకో టెక్నాలజీ యుగంలో మనిషిలో ఉన్న విచక్షణ జ్ఞానం మాత్రం తగ్గిపోతుంది అనే భావన అందరిలో కలుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలపై కూడా విచక్షణతో ఆలోచించ లేకపోతున్నాడు మనిషి. వెరసి ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని చెప్పాలి. ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కులు తక్కువ వచ్చాయని కొంతమంది టీచర్ మందలించిందని కొంతమంది.. ఏకంగా భార్యతో గొడవ జరిగిందని మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు నేటి రోజుల్లో ఎక్కువైపోతున్నాయి.


 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది  కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి. యూపీలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల యోగేష్ కి 28 ఏళ్ల మణికర్ణికతో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇక ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎంతో సాఫీగా వీరి సంసార జీవితం సాగిపోయింది. కానీ వారి సంతోషాన్ని చూసి విధి పగబట్టింది. మణికర్ణిక ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఈ క్రమంలోనే ప్రాణంగా చూసుకుంటున్న భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు భర్త యోగేష్. దీంతో ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేక.. చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. కలిసి బ్రతికం కలిసి చనిపోతాం అంటూ అతను రాసిన సూసైడ్ నోట్ అందరిని కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: